వైరల్: కోహ్లీ కూతురు దెబ్బకి తైమూర్ పాపులారిటీకి దెబ్బ పడబోతుందంటున్న నెటిజన్స్..!  

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ దంపతులకు జనవరి 11న మధ్యాహ్నం పూట ఒక పండంటి బిడ్డ పుట్టింది.దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ కూతురు హాట్ టాపిక్ అయ్యింది.2020, ఆగస్టు నెలలో తాము ఒక బిడ్డను ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అనుష్క సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఆ తర్వాత అనుష్క తన బేబీ బంప్ ని అందరికీ చూపించారు.

TeluguStop.com - Viral Netizens Say Kohlis Daughter Is Going To Hurt Timurs Popularity

అయితే భారతదేశంలో అత్యంత పాపులారిటీ కలిగిన జంట విరాట్-అనుష్క అని చెప్పుకోవచ్చు.

విరాట్ కి ప్రపంచవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు.

TeluguStop.com - వైరల్: కోహ్లీ కూతురు దెబ్బకి తైమూర్ పాపులారిటీకి దెబ్బ పడబోతుందంటున్న నెటిజన్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image

అనుష్క శర్మ కి కూడా భారత దేశ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సాధారణంగా ఇలాంటి పాపులారిటీ ఉన్న దంపతులకు మీడియాలో ఎంత అటెన్షన్ వస్తుందో.

వారి కొడుకు, కూతురు లకు కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత దక్కుతుంది.ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా మీడియాలో స్టార్ కిడ్ అయ్యారు.

ముఖ్యంగా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ కి జన్మించిన తైమూర్ అలీ ఖాన్ బాగా పాపులర్ అయ్యారు.ఆయన తుమ్మినా.

దగ్గినా వార్తల్లో నిలుస్తున్నాడు అంటే ఈ బుడ్డోడికి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Telugu Anuska Sharma, Daughter Born, Saif Ali Khan, Viral Kohili, Virat Kohli-Latest News - Telugu

తైమూర్ ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తాడా.ఫోటోలు ఎన్ని తియ్యాలి? అని ఫోటోగ్రాఫర్లు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ చూస్తారు అంటే అతిశయోక్తి కాదు.అయితే ఇక తైమూర్ అలీఖాన్ పాపులారిటీ తగ్గిపోతోందని.

మీడియా మొత్తం కూడా విరాట్ బిడ్డపైనే ఫోకస్ పెడుతుందని.నెటిజన్లు కూడా తైమూర్ ని గాలికొదిలేసి అనుష్క శర్మ బిడ్డ గురించి మాత్రమే పట్టించుకుంటారని అప్పుడే అందరూ అంటున్నారు.

తైమూర్ పాపులారిటీని తగ్గించడానికి విరాట్ బిడ్డ వచ్చేసిందని ఇంటర్నెట్ లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి.తైమూర్ ఎటువంటి అటెన్షన్ దక్కక బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు నెటిజన్లు.

ఇకపోతే విరాట్ కోహ్లీ తన బిడ్డను మీడియాకు ఎక్స్పోజ్ చేస్తారో లేదో చూడాలి.తన కూతురికి కావాల్సిన ప్రైవసీ ఇస్తారో లేక సైఫ్ అలీ ఖాన్ లాగా కాస్త ఫ్రీడమ్ ఇస్తారో చూడాలి.

#Virat Kohli #Anuska Sharma #Viral Kohili #Daughter Born #Saif Ali Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Netizens Say Kohlis Daughter Is Going To Hurt Timurs Popularity Related Telugu News,Photos/Pics,Images..