వైరల్: నీరజ్ చోప్రా తన ఐడల్ అన్న పాక్ అథ్లెట్.. దాంతో అతన్ని..?!

ఒలింపిక్స్ లో ఇండియా జెండా రెపరెపలాడింది.టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించాడు.ఫైనల్ లో నీరజ్ 87.58 మీటర్లు విసరడంతో ఈ ఘనతను సాధించాడు.ఈ పోటీలో ఫైనల్ రౌండ్‌ లో జర్మన్‌ దేశానికి చెందినటువంటి వెబర్ 4వ ప్లేస్ నిలిచాడు.ఆ తర్వాత ఐదవ స్థానంలో పాకిస్తాన్ అథ్లెట్ నదీమ్ 84.62 మీటర్లు విసిరి నిలవడం జరిగింది.నీరజ్ చోప్రా విజయం సాధించిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు, నాయకులు ఆయనకు ప్రశంసల జల్లు కురిపించారు.

 Viral Neeraj Chopra Is His Idol , A Pakistani Athlete, Arshad Nadeem, Neeraj Ch-TeluguStop.com

ఆ సమయంలో 5వ ప్లేస్ లో నిలిచినటువంటి పాకిస్థాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కూడా ట్వీట్ ద్వారా నీరజ్ కు అభినందనలు తెలిపాడు.ట్వీట్ లో గోల్డ్ మెడల్ గెలిచినటువంటి నా ఐడల్ నీరజ్ చోప్రాకు అభినందనలు అని తెలిపాడు.

ఆ తర్వాత మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.క్షమించండి.

పాకిస్తాన్ నేను నీ కోసం మెడల్ సాధించలేకపోయాను అంటూ నదీమ్ తెలపడం వివాదాస్పదమైంది.జావెలిన్ త్రో ఫైనల్ అయిపోయిన వెంటనే కొంత సమయంలోనే ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.

నీరజ్ చోప్రాను పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఐడల్ అనడంతో పాకిస్థాన్ లోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన కంటే ఒక సంవత్సరం చిన్నోడైన నీరజ్ ను ఐడల్ అని ఎందుకు అంటావని ఫైర్ అవుతున్నారు.ఇంకొందరు అయితే పతకం గెలవపోగా ఇండియన్ అథ్లెట్ ను పొగడటానికి నీకు సిగ్గుగా లేదా అంటూ కోపోద్రిక్తులయ్యారు.ఇంకొందరు మాత్రం నదీమ్ ను ప్రశంసించారు.

స్పోర్ట్స్‌మాన్షిప్ ఇలానే ఉండాలంటూ అతడిని కొనియాడారు.ప్రస్తుతం నదీమ్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ తర్వాత కొంత సమయానికి రెండు దేశాల అభిమానులు పెట్టిన ట్వీట్లు ఎక్కువయ్యాయి.అలా కొంత సేపటికే నదీమ్ అకౌంట్ నుంచి తాను పెట్టిన ట్వీట్ డిలీట్ అయిపోయింది.

కొంత సమయానికి ఇంకో ట్వీట్ పోస్టు చేశాడు.టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఆటలో గోల్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో కూడా వీరిద్దరూ షేక్ హ్యాండ్ తీసుకున్న ఫోటో వైరల్ అవుతోంది.ప్రస్తుతం అది కూాడా నెట్టింట వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube