వైరల్ : ఆటలో ఓడినందుకు ప్రత్యర్థిపై ఏకంగా ఆ అథ్లెట్..?!

క్రీడలు మనిషికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి.ఏ ఆటలోనైనా విజయం, అపజయం అనేవి ఉంటాయి.

 Viral Morocco Boxer Bites The Ear Of New Zealand Boxer David Nyikas In Tokyo Oly-TeluguStop.com

అందులో ఏది జరిగినా క్రీడాకారులు వాటిని సమానంగానే తీసుకుంటారు.అందుకే చాలా మంది స్పోర్టీవ్ గా తీసుకోవాలని అని సలహాలు ఇస్తుంటారు.

ఆటలో గెలవాలంటే ప్రత్యర్థులను చిత్తు చేయాలి.వారి మనసును, ఏకాగ్రతను చెడగొడుతుంటారు.

ఇంకొందరు కోపంతో ధూషణలు చేస్తుంటారు.ఇంకా కోపం వస్తుంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రత్యర్థి మీద తమ కోపాన్ని, ప్రతీకారాన్ని తీర్చుకుంటారు.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.జపాన్ జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలలో ఇటువంటి ఘటన జరిగింది.

మ్యాచ్‌ లో అపజయం పొందుతున్నాననే కోపంతో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బాల్లా న్యూజిలాండ్‌ బాక్సర్‌ డేవిడ్‌ న్యీకా చెవిని కొరికేశాడు.మంగళవారం రోజు కూడా టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలలో బాక్సింగ్‌ మ్యాచ్ జరుగుతోంది.

ఆ మ్యాచ్ సందర్భంగా హెవీ వెయిట్‌ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్‌ బల్లా, న్యూజిలాండ్‌ కు చెందిన డేవిడ్‌ నికా మధ్య పోరాటం చోటుచేసుకుంది.

ఆ మ్యాచ్ లో బౌట్‌ లో డేవిడ్‌ నికా మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ వస్తున్నాడు.

మ్యాచ్ లో యూనెస్‌ బల్లా ఓడిపోతున్నాననే అసహనానికి గురయ్యాడు.దీంతో మూడో రౌండ్‌ లో డేవిడ్‌ చెవి కొరకాలని చూశాడు.

యూనెస్‌ దంతాలు తగలగానే డేవిడ్‌ అతడిని దూరంగా నెట్టేసి పక్కకి జరిగిపోయాడు.ఈ బాక్సింగ్ మ్యాచ్‌లో డేవిడ్‌ 5 – 0 తేడాతో యూనీస్‌ ను ఓడించి గెలుపొందాడు.

Telugu Baalla, David Nyikas, Moroccan Boxer, Ups, Tokyo Olym, Moroccoboxer, Youn

యూనెస్ బల్లా చేసిన పనికి ఇంటర్నేషన్ బాక్సింగ్ అసోసియేషన్ అతనికి గట్టి శిక్షే వేసింది.అతనిని అనర్హుడిగా తెలిపింది.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.యూనెస్ బల్లాను నెటిజన్లు విమర్శిస్తున్నారు.మ్యాచ్ లో ఇటువంటివ చేయడం వల్ల అనేక మంది పెదవి విరుస్తున్నారు.ఇటువంటి వాడిని గట్టి శిక్షేవేశారని కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube