వైరల్: వామ్మో.. 22 కి.మీ. వెళ్లి పగ తీర్చుకున్న కోతి..!

మామూలుగా పాములు పగబడతాయనే అందరికీ తెలుసు.ఇప్పుడు ఆ కోవకు కోతి కూడా చేరిందని చెప్పుకోవాలి.

 Viral Monkey Travels 22 Kilometers To Take Revenge In Karnataka, Monkey Revenge,-TeluguStop.com

తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఓ మగ కోతి తన ప్రతీకారాన్ని తీర్చుకుంది.

ఆ కోతి వల్ల ఆ రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహర ప్రజలు భయపడిపోయారు.జగదీష్ అనే వ్యక్తి కోతి గురించి మాట్లాడితే చాలు పరుగులు పెడుతున్నాడు.

బోనెట్ మకాక్ జాతికి చెందిన 5 ఏళ్ల మగ కోతి స్థానికంగా ఉండే కొట్టిగెహారా గ్రామంలో పండ్లు, తినుబండారాలను దొంగిలించి తినేది.అంతేకాకుండా ఆ కోతి స్కూల్ పిల్లల్ని భయపెట్టేది.

ఆ కోతి భయానికి పిల్లలు అల్లాడిపోయేవారు.దీంతో ఓ వ్యక్తి కోతిని పట్టుకుని అడవిలో వదిలేయాలని ఫిర్యాదు చేశాడు.

ఫారెస్ట్ అధికారులు ఎంత ప్రయత్నించినా వారి వల్ల కాలేదు.

దీంతో ఆ గ్రామంలో ఉండే ఆటో డ్రైవర్ల సాయం కోరారు.

అక్కడున్న ఆటోడ్రైవర్ జగదీష్ అధికారులకు కోతిని పట్టించేందుకు సహాయం చేశాడు.కోతి దారి మళ్లించేందుకు జగదీష్ విశ్వప్రయత్నాలు చేశాడు.

కోతికి కోపం వచ్చి అతడిపై దాడి చేసింది.అతని చేతిని గట్టిగా కోరికి గాయం చేసింది.

కోతి భయానికి జగదీష్ అక్కడి నుంచి పరారయ్యాడు.జగదీష్ ఎక్కడున్నా వెతికి మరీ అతన్నీ కోతి ఇబ్బంది పెట్టేది.

Telugu Jagadish, Karnataka, Monkey, Monkey Attack, Monkey Revenge, Revenge, Rowd

దీంతో ఓ రోజు 30 మంది 3 గంటలు కష్టపడి కోతిని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు పట్టించారు.ఆ ఊరికి 22 కిలో మీటర్ల దూరంలో తీసుకెళ్లి కోతిని అడవిలోకి విడుదల చేశారు.అయితే వారం రోజుల్లోనే ఆ కోతి కొట్టిగెహారా గ్రామానికి మళ్లీ వచ్చి జగదీష్ ని భయపెట్టింది.అటవీ శాఖ టీమ్ కోతిని రెండోసారి కోతిని పట్టుకుని చాలా దూరం తీసుకెళ్లి వదిలిపెట్టారు.

మళ్లీ ఆ కోతి రాకుండా ఉండాలని జగదీష్ ఆశిస్తున్నాడు.కోతి పేరు ఎత్తితే చాలు భయపడిపోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube