కోతులు అనగానే మనకు అల్లరి గుర్తుకు వస్తుంది.ఎందుకంటే కోతి చేష్టలు అలా ఉంటాయి మరి.
అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదు.అందుకే చిన్న పిల్లలు కూడా ఎవరైనా ఇలాంటి వింత పనులు చేస్తే వారిని కోతి చేష్టలు అని తిడుతుంటారు కదా.
అయితే కోతులు చేసే పనులు కొన్ని సార్లు నవ్వించేలా ఉంటే.మరికొన్ని సార్లు మాత్రం కోపం తెప్పిస్తుంటాయి.
ఇంకొన్ని సార్లు అయితే భయంకరంగా ఉంటాయి.అయితే ఇప్పుడు మాత్రం ఓ కోతి ఏం చేస్తుందో చూస్తే ఇలా కూడా కోతులు చేస్తాయా అని షాక్ అయిపోతారు కావచ్చు.
ఇప్పుడు మేం చూపించబోయే వైరల్ వీడియోను చూస్తే మాత్రం మీ కండ్లను మీరే నమ్మలేరు.మనం హెయిర్ సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకోవడం సర్వ సాధారణం.
అయితే మనుషుల తర్వాత అలాచేసే వాటిల్లో ఎక్కువగా కుక్కలు మనకు కనిపిస్తుంటాయి.సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్కలు ఉంటున్నాయి.
దీంతో వారు ఆ పెంపుడు కుక్కలకు హెయిర్ కట్ చేయించడం కామన్ అయిపోయింది.కానీ ఇప్పుడు మాత్రం ఓ కోతికు హెయిర్ కట్ చేయడం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఈ వీడియోను చూస్తే ఆ కోతి ఎంతో పద్దతిగా కూర్చుంటుంది.
ఓ సెలూన్ షాపులోకి రాయల్ గా ఎంట్రీ ఇచ్చేసిన కోతి అందులోని కుర్చీలో కూర్చుంటుంది.ఇక బుద్దిగా సెలూన్ లో పనిచేసే వ్యక్తికి సహకరిస్తూ హెయిర్ కట్ చేయించుకుంటోంది.అతన్ని ఏమీ అనకుండా పూర్తిగా అతను చెప్పినట్టే చేయడం ఇందులో మనం చూడొచ్చు.
ఇక కోతి ఇలా చేయడాన్ని కొందరు వీడియో తీయగా దాన్ని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ సోషల్‌మీడియా ద్వారా ట్విట్టర్ లో షేర్ చేశారు.ఇంకేముంది దాన్ని నెటిజన్లు విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
ఇక ఆ కోతి హీరోలా రెడీ అయిపోతుందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.