వైరల్: మూసీ నదిలో సంచరిస్తున్న జలకన్యలు.. షేక్ చేస్తున్న వీడియో?

జలకన్యలు.వీటిగురించి వినడమే తప్ప, ఎక్కడా చూసిన దాఖలాలు మనకు కనిపించవు.అయితే ఒకదగ్గర కనిపిస్తాయండోయ్.విక్టరీ వెంకటేష్ హీరో చేసిన ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాలో ఓ అందమైన జలకన్య కనబడుతుంది.ఇందులో జకన్య ఉంటే ఎలా ఉంటుందో అన్న విషయాన్ని చాలా అద్భుతంగా చూపించారు.అయితే వందల ఏళ్ళ క్రితమే హాలీవుడ్లో ఈ ఇతివృత్తంతో ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే.

 Viral: Mermaids Roaming In The Musi River Shaking Video Musi River, Viral Latest-TeluguStop.com

జలకన్య అనేది మనిషి ఊహకి ఓ అందమైన రూపమని చెప్పుకోవాలి.అయితే ఇపుడు దాన్ని నిజం చేస్తూ మన హైదరాబాద్లోనే వున్న ముసినదిలో ఓ జలకన్య సంచరించడం స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది.

ఇటీవలి కాలంలో జలకన్యలు కు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ ఈ వీడియో చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది.అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు అన్నీ కేవలం ఫేక్ వీడియోలు మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే.

ఈ తరుణంలో హైదరాబాద్ లో జలకన్యలు అన్న ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.హైదరాబాద్లో పైగా ముసినదిలో జలకన్య వుండడమేమిటని అనుకుంటున్నారా? సముద్రాలలో కదా ఉండేది! అనే అనుమానం కలగక మానదు.పైగా కంపు కొట్టే చోట జలకన్యలు వంటివి ఉండకపోవచ్చు అనుకుంటున్నారా. మీ అనుమానం 100% నిజం.

అలాంటిచోట్ల ఎలాంటి జలకన్యలు వుండవు.సముద్రాలలో కూడా వుండవు.

అసలు జలకన్య అనేది ఒక అందమైన అబద్ధమని ముందే చెప్పానుకదా.అయితే ఈ వీడియో ఎక్కడ గ్రాఫిక్స్ తో క్రియేట్ చేసినట్టు లేకపోవడం గమనార్హం.

దీంతో ఇది నిజమా అబద్దమా అని కన్ ఫ్యూజన్ లో పడిపోయారు నెటిజన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube