వైరల్: సరదాగా పోస్ట్ చేసిన మీమ్ లక్షలలో అమ్మకం..!

ఒక్కోసారి అదృష్టం అనేది దరిద్రం పట్టినట్లు పడుతుంది అనడానికి ఈ వ్యక్తి ఒక ఉదాహరణ అని చెప్పాలి.ఏదో సరదాకి సోషల్ మీడియాలో ఒక మీమ్ క్రియేట్ చేసి దాన్ని పోస్ట్ చేయగా అది కాస్త అతనికి అదృష్టాన్ని తెచ్చి పెట్టింది.

 Viral Meme On Friendship In Social Media Sold To 38 Lakh Rupees-TeluguStop.com

సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల మీమ్స్ బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.ఇలాంటి సమయంలో ఈప్పుడు ఫ్రెండ్ షిప్ కి సంబందించిన మీమ్ ఒకటి బాగా వైరల్ అయింది.

ఒక వ్యక్తి ఎప్పటినుంచో స్నేహం చేసిన వ్యక్తితో మనస్పర్థలు వచ్చి అతనితో కటీఫ్ కొట్టి వేరే కొత్త స్నేహితునితో దోస్తానాకు రెడీ అయ్యాడు.అయితే ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియచేయాలనీ అనుకున్నాడు.

 Viral Meme On Friendship In Social Media Sold To 38 Lakh Rupees-వైరల్: సరదాగా పోస్ట్ చేసిన మీమ్ లక్షలలో అమ్మకం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫ్రెండ్ షిప్ కటీఫ్ అయిన స్నేహితుని ఫొటోతో పాటు కొత్తగా స్నేహితుడైన మరో వ్యక్తి ఫోటోను కూడా కలిపి ఏకంగా ఒక మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.అలా క్రియేట్ చేసిన మీమ్ అతనికి లక్షల్లో డబ్బులు తెచ్చిపెట్టింది.

అసలు ఇంతకీ ఆ స్నేహితులు ఎవరు.ఆ మీమ్ కు ఎందుకు అన్ని డబ్బులు వచ్చాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పాకిస్ధాన్ లోని గుజ్రన్ వాలాకు చెందిన ఆసిఫ్ రాజా, ముదసిర్ ఇస్మాయిల్ అహ్మద్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా కలిసి ఉండేవారు.కానీ వీరి మధ్య కొన్ని కారణాల వలన గొడవలు జరగడంతో విడిపోయారు.

Telugu 38 Lakh Rupees, Asif Raja, Gujran Wala, Lakshs, Meme Photo, Mudassir Ismail Ahammed, Pakistan, Selled, Social Media, Vir Photos, Viral Latest, Viral News-Latest News - Telugu

అయితే ఇలా స్నేహం బ్రేకప్ అయిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలియచేసే ప్రయత్నంలో ఆసిఫ్ రాజా, ఇస్మాయిల్ తో తన స్నేహం కట్ అయ్యిందని తెలుపుతూ.ఇకమీదట తన కొత్త స్నేహితుడు సల్మాన్ అహ్మద్ నక్వష్ అని రాసి ఓ పోస్టు చేసాడు.

ఆ పోస్ట్ పెట్టడంతో పాటు కొత్త ఫ్రెండ్ తో చేతులు కలిపిన ఫోటోతోపాటు, తన పాత ఫ్రెండ్ ఫోటోలను కూడా పెట్టి అతని ఫోటో మీద క్రాస్ మార్కు పెట్టి “ఫ్రెండ్ షిప్ ఎండెడ్ విత్ ముదసిర్.నౌ సల్మాన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్” అని ఒక మీమ్ క్రియేట్ చేసి ఆసిఫ్ రాజా పోస్ట్ చేశాడు.అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు.2015లో జరిగిన ఘటన మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.అతడు అప్పుడు పోస్ట్ చేసిన మీమ్ కు గాను ఎన్ఎఫ్టీ వేలం వేయగా ఏకంగా 38 లక్షల రూపాయల ధర పలికింది.ఫ్రెండ్ షిప్ డే రోజునే దీనిని అమ్మడం కూడా జరిగింది.

ఇలా ఈ మీమ్ ద్వారా ఆ ముగ్గురు వ్యక్తులు ఫేమస్ అయ్యారు.ఆసిఫ్ రాజా మాత్రమే లక్షాధికారి అయినందుకు సంబరపడిపోతున్నాడు.

#Pakistan #Meme #MudassirIsmail #Lakshs #Asif Raja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు