వైరల్: కేవలం రూ. 110 చెల్లించలేదని ఆగిన పెళ్లి.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?!

అనుకున్న సమయానికి చక్కగా పెళ్లి చేసుకుని వేరే దేశంలో కాపురం పెడదామని అనుకున్న ఒక ప్రేమ జంటకి అనుకోని చిక్కొచ్చు పడింది.కేవలం ఒక రూ.110 గురించి వాళ్ళ పెళ్లి ఆగిపోయింది.చివరికి ఆ ప్రేమజంట కోర్టును కూడా ఆశ్రయించింది.

 Viral Marriage Stopped For Nor Giving Just 110 Rupees Whats The Matter , Viral L-TeluguStop.com

కానీ.అక్కడ కూడా ఆ జంటకు అనుకూలంగా తీర్పు వెలువడలేదు.

చేసేది లేక పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవాలిసిన పరిస్థితి వచ్చింది.అసలు రూ.110 కారణంగా పెళ్లి ఆగిపోవడం ఏంటి.అని షాక్ అవుతున్నారా.

అసలు విషయం తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.వివరాల్లోకి వెళితే.

కేరళకు చెందిన ఈ ఇద్దరు ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు.అయితే అబ్బాయి అమ్మాయి వేరు వేరు కులాలకు చెందిన వారు.ఇద్దరు కలిసి కులాంతర వివాహం చేసుకోవాలని అనుకున్నారు.అయితే సదరు యువతి మాత్రం సౌదీ అరేబియాలో ఒక నర్సుగా పనిచేస్తోంది.

పెళ్లి సమయానికి కేరళ వచ్చి పెళ్లి చేసుకుని భర్తను కూడా సౌదీ తీసుకుని వెళ్లి ఇద్దరు అక్కడే సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు.

కానీ కేరళలో మాత్రం కులాంతర వివాహం చేసుకోవాలంటే 1958 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక రూ.110 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఆ తరువాత నోటీసులను రిజిస్ట్రేషన్ ఆఫస్ బోర్డులో అందరికి కనిపించేలా పెట్టడం జరుగుతుంది.

అయితే ఒక నెల లోపు వీళ్ళ పెళ్లి విషయంపై ఎవరు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోతే ఆ జంట యొక్క వివాహాన్ని రిజిస్టర్ చేసి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు.అయితే ఈ జంట కూడా సేమ్ ప్రోసెస్ లో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి.

Telugu Kerala, Rupees, Paid, Ed, Stopped, Latest-Latest News - Telugu

ఈ క్రమంలో జూన్ 11 వ తేదిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌‌ కు తమ వివాహనికి సంబంధించిన నోటీసు మాత్రమే పంపారు.కానీ.నోటీసుకు సంబంధించిన 110 రూపాయిల ఫీజును మాత్రం చెల్లించలేదు.ఫీజు విషయం మర్చిపోయారేమో గాని సదరు యువకుడు నోటీసు గురించి ఆరా తీద్దామని ఆఫీస్ కి వెళ్లగా అక్కడ నోటీసు బోర్డులో వాళ్ళ మ్యారేజ్ కి సంబంధించి ఏ నోటీసు అతికించి లేదు.

అయోమయంలో ఉన్న యువకుడు మా పెళ్ళికి సంబందించిన నోటీసు లేదంటని సదరు ఆఫీసర్ ని ప్రశించిగా ఆయన చెప్పిన మాట విని షాక్ అయ్యాడు.

మీరు నోటీసుతో పాటు 110 రూపాయిలు కూడా చెల్లించాలని, డబ్బులు కట్టలేని కారణంగా ఆ నోటీసును బోర్డ్ లో పెట్టలేదని చెప్పాడు.

Telugu Kerala, Rupees, Paid, Ed, Stopped, Latest-Latest News - Telugu

మీరు ఎప్పుడయితే డబ్బులు కడతారో ఆ రోజు నుంచే పరిగణలోకి తీసుకుని నెల తరువాత మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేసారు.ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి జులై 9న యువకుడు రూ.110 ఆఫీసులో కట్టి రిజిస్టర్ చేయించాడు.అంటే మళ్ళీ వీళ్ళ పెళ్లి సర్టిఫికెట్ రావాలంటే ఆగస్టు 9 వరకు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది.

అక్కడితో ఆగకుండా ఈ ప్రేమజంట ఆగస్టు 9వ తేదీ కంటే ముందు డేట్ లోనే పెళ్లి చేసుకునేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది.కానీ అక్కడ కూడా వీళ్ళకి అదే తీర్పు వెలువడింది.

చేసేదేమి లేక యువతి భారతదేశానికి వచ్చే సమయాన్ని వాయిదా వేసుకుని ఆగస్టు 9 తర్వాత పెళ్లి చేసుకుని సౌదీ అరేబియాకి వెళ్ళిపోతామని యువకుడు చెప్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube