వైరల్ : రెండో ఎక్కం చెప్పలేదన్న కారణంతో పెళ్లి ఢమాల్..!

పెళ్లి అనేది రెండు కుటుంబాలను కలిపే ఒక పెద్ద వేడుక.రెండు జీవితాలను ముడివేసే బంధం.

 Viral Marriage Stopped As Groom Dont Know Second Math Table In Kanpur Uttarpradesh-TeluguStop.com

అటువంటి పెళ్లి రెండో ఎక్కం రాలేదని ఆగిపోయిందంటే చాలా మంది ముక్కున వేలేసుకుంటారు.ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మహోబాలోని పన్వారీ ఏరియాలో పెళ్లి వేడుక బాగా జరుగుతోంది.పెళ్లిమండపంలో పంతులు మంత్రాలు చదువుతుంటే వరుడు మంత్రాలు, లెక్కలూ మనకు అర్థం కావు అన్నట్లుగా ప్రవర్తించాడు.

 Viral Marriage Stopped As Groom Dont Know Second Math Table In Kanpur Uttarpradesh-వైరల్ : రెండో ఎక్కం చెప్పలేదన్న కారణంతో పెళ్లి ఢమాల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో పెళ్లి కూతురు ఒక్కసారిగా కోపంతో విరుచుకుపడింది.పెళ్లికొడుకుతో ఆమె వాదనకు దిగింది.“చిన్న చిన్న లెక్కలు వచ్చు కదా” అంటే వరుడు సైలెంటుగా ఉన్నాడు.పెళ్లికొడుకు నోట సమాధానం రాకపోవడంతో పెళ్లికూతురు ఫైర్ అయిపోయింది.“అసలు మీరు ఏం చదువుకున్నారు.రెండో ఎక్కం చెప్పండి” అంది.“మీరు రెండో ఎక్కం చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది” అని భీకరగా అరిచిమరీ చెప్పింది.

దీంతో వరుడు రెండో ఎక్కం రాకపోవడం వల్ల చెప్పలేకపోయాడు.

ఒళ్లు మండిన వధువు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది.పెళ్లి ఆగిపోవడంతో మండపంలో అందరూ షాక్ కి గురయ్యారు.పెళ్లికూతరు మండపం నుంచి కిందకు దిగగానే రెండు వైపులా కుటుంబ సభ్యులు ఏమైందమ్మా అని అడిగారు.“మీరే చెప్పండి.2వ ఎక్కం చెప్పలేకపోతున్నారు.అలాంటి ఆయన్ని నేను పెళ్లి చేసుకోవాలా, నాకు ఇష్టం లేదు” అంది.

అందరూ తెల్లమొఖం వేశారు.రెండువైపులా కుటుంబ సభ్యులకు పెళ్లి ఆగడం ఇష్టం లేదు.

అమ్మాయని కన్వీన్స్ చేద్దామని ఆమె ఫ్రెండ్స్‌ని ఆమె దగ్గరకు పంపారు.వారు ఏంచెప్పినా ఆమె ఎంతకీ ఒప్పుకోలేదు.

ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు.వారు కూడా పీటల మీద పెళ్లి ఆగిపోవడం కరెక్టు కాదు అనుకొని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు.

అయినా ఫలితం లేకపోయింది.వరుడు నిరక్షరాశ్యుడనే విషయం ముందు చెప్పకపోవడంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు దీనిపై ఎలాంటి కేసూ రాయలేదు.వధువు ఇష్టప్రకారమే పెళ్లి ఆపేసుకున్నారు.

#Uttar Pradesh #2nd Table #Wedding Stopped #Reason #Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు