వైరల్: ATM నుండి ఎంతకీ కదలని వ్యక్తిని ఓపిక నశించి ఇలా చేసారు?

సోషల్ మీడియా పరిధి బాగా పెరగడంతో అనేక రకాల వీడియోలు ప్రతి రోజూ వైరల్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని ఫన్నీగావుంటే, మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి, ఇంకొన్ని చాలా జుగుప్సాకరంగా ఉంటాయి.

 వైరల్: Atm నుండి ఎంతకీ కదలని వ్య-TeluguStop.com

ఈ కోవలోనే ఒక వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.దాన్ని చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు.

ATM వద్ద డబ్బులు డ్రా చేసుకోవడం అనేది చాలా సర్వ సాధారణమైన అంశం.ఐతే ఎవరైన మనకంటే ముందు డబ్బులు తీసుకుంటుంటే కాసేపు ఆగుతాం కానీ అదే వ్యక్తి అక్కడినుండి ఎంతకీ కదలకపోతే బాగా కోపం వస్తుంది కదూ.

 వైరల్: ATM నుండి ఎంతకీ కదలని వ్య-TeluguStop.com

ఇక్కడ కూడా అదే జరిగింది.ఒక వ్యక్తి ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని మిగిలినవారు వెయిట్ చేస్తారు.

ఎంతసేపైనా అతను అక్కడినుండి కదలకపోవడంతో ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి తడతాడు.కట్ చేస్తే ఆవ్యక్తిని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న వారు షాక్‌ అయిపోతారు.

అసలేం జరిగిందంటే… UKలోని టెస్కో క్యాష్‌ పాయింట్‌ సమీపంలో ఉన్న ఏటీఎం వద్ద ఒక వ్యక్తి నుంచుని ఉంటాడు.ఎంతకీ ఒక పట్టాన కదలడు.ఒకపక్క జనాలంతా క్యూలో నుంచుని అలానే ఉంటారు.

ఇంతలో ఒక వ్యక్తి ఎంతసేపు ఇలా అని కోపంతో దగ్గరకు వచ్చి చేత్తో తడతాడు.అయినా కదలడు.దీంతో అనుమానంతో దగ్గరకు వచ్చి చూస్తే అది ఒక బొమ్మ.

దీంతో వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు.అబ్బా టైం వేస్ట్‌ చేశామే గానీ అసలు ఎందుకు కదలకుండా అలా ఉన్నాడని గమనించ లేకపోయామే అనుకున్నారు వారంతా.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తె వైరల్‌ అవుతోంది.అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి.

మీరు కూడా ఓ లుక్కేసి కామెంట్స్ చేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube