వేరుశెనగతో సోడా తయారీ ఏమిటి మీ పిచ్చికాకపోతే… అని అంటారా? ఏమో మరి, నెటిజన్లకు కూడా ఈ విషయం నచ్చి ఉండదు.అందుకే ఆ షాప్‌ను క్లోజ్ చేయాలని పట్టుబడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో వైరల్ వీడియోలలో కెల్లా చాలా గమ్మత్తైన వీడియో అని చెప్పుకోవచ్చు.ఇక్కడ వీడియో చూస్తే రకరకాల పదార్ధాలతో… వింతైన ఆహారం, డ్రింక్స్ ను కలగలిపి తయారు చేసిన ఓ వింతైన రెసిపీ అని అనిపించకమానదు.
అయితేనేం, వాటికి కూడా కస్టమర్లు ఉంటారని అక్కడి స్థానికులు ప్రూవ్ చేస్తున్నారు.
విషయం ఏమంటే ఓ స్ట్రీట్ ఫుడ్ అమ్మే వ్యాపారస్తుడు సమ్మర్ స్పెషల్ గా కూల్ డ్రింక్స్ ను అమ్మకానికి ఉంచాడు.దానికి సంబంధించిన వీడియో ఒకటి ఫుడ్ బ్లాగింగ్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘ఫుడ్ అడిక్టెడ్’లో షేర్ చేయ బడింది.దాంతో వెలుగు చూసింది.
దానిపేరు కూడా చీజ్ సోడా బ్లాస్ట్ డ్రింక్.చీజ్ ను సాధారణంగా పాస్తా, పిజ్జా , శాండ్‌విచ్‌ల వంటి ఆహార పదార్ధాలకు టాపింగ్ చేస్తారు కదా.అయితే ఈ చీజ్ సోడా బ్లాస్ట్ డ్రింక్‌లో చీజ్ ను గార్నిష్‌గా ఉపయోగించాడు.డ్రింక్ ఆకుపచ్చ రంగులో ఉండడం కొసమెరుపు.
అవును, వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా ఒక గాజు గ్లాస్ తీసుకుని దానిలో ఐస్ వేసి.వేరు శనగ గింజలను వేసాడు.తరువాత దానిని వివిధ రంగుల పైనాపిల్, బ్లూబెర్రీ సోడాలతో పూర్తిగా నింపేశాడు.ఆ కూల్ డ్రింక్ ను చీజ్ తో తరువాత అలంకరించడం చూడవచ్చు.ఫస్ట్ టైం.సూరత్ చీజ్ బ్లాస్ట్ సోడా జున్ను బ్లాస్ట్ సోడా.మీకు దైర్యం ఉంటే ఒక్కసారి తాగి చూడండి అంటూ సదరు వీడియోకి క్యాప్షన్ ఇవ్వడం మనం గమనించవచ్చు.దీనిని చూసిన నెటిజన్లు నిజమే దానిని తాగడానికి ధైర్యం కావాలి.
ఎందుకంటే ఆరోగ్యం హరీ కదా! అంటూ కామెంట్లు పెడుతున్నారు.కొందరైతే “ఆహారంలో కొత్తవి ప్రయత్నించకుండా సూరత్‌ను నిషేధించాలి” అని వ్యాఖ్యానించారు.