వైరల్: అతడి ఇంటినిండా ఎన్ని రేడియోలున్నాయో చూడండి.. ఎన్ని వేల రేడియోలంటే?

మనలో కొంతమందికి ఏదన్నా తమకి ఇష్టమైన కొన్ని రకాల వస్తువులను కలెక్ట్ చేసే అలవాటు ఉంటుంది.అదొక హాబీలా పెట్టుకుంటారు.

 Viral: Look How Many Radios Are There In His House How Many Thousands Of Radios,-TeluguStop.com

నిరంతరం వాళ్ళు ఎక్కడ వున్నా అలాంటి వస్తువులపై ఓ కన్నేసి ఉంచుతారు.ఈ క్రమంలో ఓ వ్యక్తి రేడియోలను కలెక్ట్ చేస్తూ పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

అవును, ఒకప్పుడు అద్భుతమైన పాటలు, వార్తలు వినిపించిన రేడియోలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయనే విషయం అందరికీ తెలిసినదే.స్మార్ట్ ఫోన్‌లు, ఎల్‌ఈడీ, స్మార్ట్ టివీలు వచ్చిన తర్వాత రేడియో కొనుగోలు చేసే వాళ్లే కరువయ్యారు.

ప్రాచీన వస్తువులు, పురావస్తుశాఖ సేకరించిన వాటిని మ్యూజియంలో భద్రపరిచినట్లుగా రేడియోలను( Radios ) ఇపుడు తరువాతి తరాలు చూసేందుకు దాచవలసి వస్తోంది.అచ్చం అలాగే వాటిని దాస్తున్నాడు ఉత్తరప్రదేశ్‌( Uttar Pradesh )లోని ఒక రేడియో అభిమాని.వాటిని భద్రపరచడం పనిగా పెట్టుకున్నాడు.అమ్రోహకు చెందిన రామ్‌సింగ్ ( Ram singh, )అనే వ్యక్తి స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న రేడియోలతో పాటు 2010వరకు చెలామణిలో ఉన్న రేడియోలను కూడా సేకరిస్తూ వస్తున్నాడు.

అలా రామ్‌సింగ్ దగ్గర మొత్తం 11వందల రేడియోలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? రేడియోలను సేకరించడమే కాదు.సుమారు 70-80ఏళ్ల క్రితం నాటి రేడియోలను కూడా భద్రంగా తన ఇంట్లో దాచి పెట్టుకోవడం విశేషం.రామ్‌సింగ్‌ దగ్గర ఇండియాకు స్వతంత్ర్యం రాక ముందు వాడుకలో ఉన్న రేడియోలతో పాటు 2010వరకు ఉపయోగించిన రేడియోలు కూడా వున్నాయి.రేడియోలపై అతనికి వున్న ఆసక్తి, కనుమరుగైపోతున్న రేడియోలు భవిష్యత్ తరాలకు చూపించాలనే తపన చూసి అతనిని చాలామంది మెచ్చుకుంటున్నారు.

దాంతో అతగాడు సెలిబ్రిటీ అయిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube