వైరల్ వీడియో: స్విమ్మింగ్ పూల్ ను ఇలా కూడా తయారు చేసుకోవచ్చా..?!

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎటువంటి వింతలు, విశేషాలు జరిగినాగాని క్షణాల్లో అందరికి తెలిసిపోతున్నాయి.కొన్ని వీడియోలు చూడడానికి ఫన్నీ గా ఉంటే మరికొన్ని మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.

 Viral Latest News Viral Social Media Viral Photos Viral Video Swimming Pool-TeluguStop.com

అలాగే ఇప్పుడు చాలామంది ఎవరికీ నచ్చిన స్తంట్స్ వాళ్ళు చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు.అలాగే కొన్ని వీడియోలు మాత్రం అసలు ఇదెలా సాధ్యం అనేలాగా కూడా ఉంటాయి.

మరి కొంతమంది అయితే తమ సొంత తెలివితేటలు ఉపయోగించి వాళ్లకు నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే వారు పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారుతుంది.

 Viral Latest News Viral Social Media Viral Photos Viral Video Swimming Pool-వైరల్ వీడియో: స్విమ్మింగ్ పూల్ ను ఇలా కూడా తయారు చేసుకోవచ్చా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు ఇందుకు తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

సాధరణంగా మనకు స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ చేస్తూ ఉంటాము.

అలా కాకుండా ఏ బీచ్ దగ్గరికో లేక ఏ నది దగ్గరకో వెళ్లి ఎంచక్కా ఈత కొట్టుకుని వస్తాము.కానీ ఒక కుర్రాడు మాత్రం అందుకు బిన్నంగా తన కోరిక తీర్చుకున్నాడు.

ఎలా అనుకుంటున్నారా.? ఒక ట్రాక్టర్ ట్రక్కునే ఏకంగా స్విమ్మింగ్‌ ఫూల్ లాగా మార్చేసి అందులో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.అవును.ట్రాక్టర్ లో స్విమ్ చేయడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా.?

ఆ వివరాల్లోకి వెళితే.ఈ వీడియోలో చూసినట్టు ఒక కుర్రాడు ట్రాక్టర్ ట్రక్కులో స్మిమ్మింగ్ ఫూల్ ఏర్పాటు చేసుకున్నాడు.ట్రాక్టర్ చుట్టూ ఒక ప్లాస్టిక్ కవర్‌ను ఏర్పాటు చేసి దానిలో నీటిని నింపాడు.తరువాత అందులో స్మిమ్మింగ్‌ పూల్‌ లో మాదిరి స్నానం చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాడిని చూసి తెగ నవ్వుకుంటున్నారు.అయితే ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత అందరిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది.

అదేంటంటే అసలు ఇలాంటి ఐడియా మనకు ఎందుకు రాలేదబ్బా అని అనుకుంటున్నారు.ఏది ఎలా ఉన్నా కుర్రాడి ఐడియాని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

#Truck #Pool

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు