బాబోయ్.. అది తలనా లేక పేల ఫ్యాక్టరీనా..?!

ఆడవాళ్లకి జుట్టే అందం.కానీ, ఆ జుట్టులో పేలు ఉంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుంది.

 Viral Latest Hair Hair Lies Hair Care Factoryastrleiahair Stailistviral-TeluguStop.com

ఈ ప్రపంచంలో జుట్టు ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇలా పేల సమస్యతో ఎప్పుడో ఒకప్పుడు ఇబ్బందులు పడే వుంటారు.ఆడవాళ్ళతో పోలిస్తే మగ వాళ్లలో ఈ పేల సమస్య కొంచెం తక్కువనే చెప్పాలి.

ఎందుకంటే ఆడవాళ్ళ జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉంటుంది.తలలో పేలు ఉంటే అవి కుడుతూ ఉంటాయి.

 Viral Latest Hair Hair Lies Hair Care Factoryastrleiahair Stailistviral-బాబోయ్.. అది తలనా లేక పేల ఫ్యాక్టరీనా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా కుట్టిన్నప్పుడు తల అంతా ఒకటే దురద వస్తుంది.అసలు నిద్ర కూడా పట్టదు.

అసలు మామూలుగానే తలలో ఒకటి, రెండు పేలుంటేనే తట్టుకోవటం చాలా కష్టం.అలాంటిది తలలో కుప్పలు కుప్పలుగా పేలు పడితే ఆ బాధని వర్ణించడం చాలా కష్టం అనే చెప్పాలి.

ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతికి ఇప్పుడు ఇలాంటి ఒక దారుణ పరిస్థితినే ఎదుర్కొంది.ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని ఫలితం లేకపోవడంతో చివరి ప్రయత్నంగా హెయిర్‌ లైస్‌ రిమూవలిస్ట్‌ ను ఆవిడ సంప్రదించింది.

పూర్తి వివరాలలోకి వెళితే.ఆస్ట్రేలియాలోని కమిలోకు చెందిన ప్రముఖ హేయిర్‌ లైస్‌ రిమూవలిస్ట్‌ షెర్రీ రిచర్డ్‌సన్‌ నిట్‌ పైకర్స్‌ హెడ్‌ లైస్‌ రిమూవల్‌ పేరిట ఓ సెలూన్‌ నిర్వహిస్తోంది.

కొన్ని రోజుల క్రితం విపరీతంగా పేలతో బాధపడుతున్న ఆ యువతి హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చిందట.ఆ యువతికి పేలను తొలగించే క్రమములో దువ్వెనతో ఆ యువతి తలను దువ్విచూడగా కుప్పలు కుప్పలుగా దువ్వెనలో పేలు వచ్చాయి.

అన్ని పేలను ఒక్కసారిగా చూడడంతో హెయిర్ స్టైలిస్ట్ షాక్ అయ్యి.దాన్ని కాస్త వీడియో తీసి షెర్రీ తన టిక్‌ టాక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా మారింది.ఏకంగా 5 మిలియన్ల మంది ఆ వీడియోను చూసారు.

ఆ వీడియో చూసి ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు.సుమారు 75 వేలకుపైగా ప్రతిస్పందనలు.

ఈపోస్ట్ కు వచ్చాయి.దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అది అసలు తలేనా.? అని కామెంట్స్ పెడుతున్నారు.అన్ని పేలను అసలు తలలో ఎలా పెంచుతున్నావ్.

మహా తల్లి అని మరి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

#Hair Care #Hair #Hair Lies #Factory

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు