వైరల్: సోషల్ మీడియాలో కిరణ్ బేడీ వీడియో.. హెలికాప్టర్‌ను తిమింగళం మింగేసిందా?

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ అనేక ఆసక్తికరమైన వీడియోలు, ఫోటోలు, విషయాలు వైరల్ అవుతున్నాయి.ఇంటర్నెట్ సదుపాయం మారుమూల కుగ్రామాలకు సైతం అందుబాటులోకి వచ్చాక.

 Viral: Kiran Bedi Video On Social Media Did The Whale Swallow The Helicopter , Helicopter, Kiran Bedi, Sea Of ​​shark , 5 Headed Shark Attacked-TeluguStop.com

ప్రపంచం నలుమూలలా వున్న విషయాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయి.ఎక్కడి ఇన్ఫర్మేషన్ అయినా ఇట్టే తెలుసుకుంటున్నారు.

రోజుకు లక్షలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి.కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఏడుపు తెప్పిస్తాయి, ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

 Viral: Kiran Bedi Video On Social Media Did The Whale Swallow The Helicopter , Helicopter, Kiran Bedi, Sea Of ​​Shark , 5 Headed Shark Attacked-వైరల్: సోషల్ మీడియాలో కిరణ్ బేడీ వీడియో.. హెలికాప్టర్‌ను తిమింగళం మింగేసిందా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఒకింత షాక్‌కు గురి చేస్తుంది.

అవును.

ఈ వీడియోని చూస్తే మీకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది.ఇది నిజామా, అబద్ధమా అనే అనుమానం కలగకమానదు.

అయితే ఏమాత్రం నాలెడ్జ్ వున్న ఎవరికైనా అది అబద్ధమే అని ఇట్టే తెలిసిపోతుంది.అయితే, ఈ వీడియోను ఏకంగా మాజీ IPS అధికారిని, మాజీ గవర్నర్ కిరణ్ బేడీ షేర్ చేయడంతో ఆ వీడియో మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

అయితే ఇక ఈ వీడియోలో ఏముందో చూద్దాం.వీడియోలో ఓ హెలికాప్టర్ సముద్రానికి అతి సమీపంగా ప్రయాణిస్తోంది.

సముద్రంలో పడవలో ప్రయాణిస్తున్న పర్యాటకులు ఆ హెలికాప్టర్‌ను గమనిస్తూ వున్నారు.ఇంతలో ఊహించని పరిణామం, సముద్రంలోంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన షార్క్.

గాల్లోకి ఎగిరి ఆ హెలికాప్టర్‌ను అమాంతం మింగేస్తుంది.

కాదు కాదు.

షార్క్ సముద్రంలోకి ఆ హెలికాప్టర్‌ను తీసుకెళ్లిపోవడంతో అది అమాంతం పేలిపోతుంది.దాంతో ఆమొత్తం సీన్ ని చూసిన షిప్‌లోని జనాలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.

అయితే, ఆమాత్రం గ్రాఫిక్స్ మీద అవగాహన వున్నవారికి ఆ వీడియో నేచురల్ కాదని, ఎడిటింగ్ చేసిందని ఇట్టే గ్రహిస్తారు.నిజానికి ఈ వీడియో 2017లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘5 Headed Shark అట్టాక్డ్‘లోని ఓ సన్నివేశం.

ఇక ఈ ఎడెటెడ్ వీడియోను కిరణ్ బేడీ లాంటి ప్రముఖులు షేర్ చేయడంపై నెటిజన్లు ఒకింత అసహనానికి గురి అవుతున్నారు.ఆమె ఏమనుకొని ఆ వీడియో షేర్ చేసిందో తెలియదని కొంతమంది కామెంట్లు పెట్టగా, మరికొంతమంది మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube