వైరల్: జరిగితే పెద్ద ప్రమాదమే.. పులిపిల్లను ఆడుకోవడానికి ఇంటికి తీసుకెళ్లిన పసిపాప!

పసిపిల్లలు. వారిగురించి మాట్లాడకుంటే మనకి రోజే గడవదు.

 Viral Kid Baby Girl Brought Leopard Cub Mistaking As Cat Cub In Maharashtra Deta-TeluguStop.com

ఆ స్థాయినుండి వచ్చిన మనం వారిని చూసినపుడు మరలా వారి వయస్సుకే వెళ్ళిపోతాం.వారు చేసే చేష్టలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

అందుకే పొద్దంతా కస్టపడి, ఏ సాయంత్రమో వారితో కాసేపు గడిపితే ఆరోజంతా పడే కష్టాన్ని ఇట్టే మర్చిపోవచ్చు.ఇలా వారి చేష్టలు ఒక్కోసారి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

తాజాగా అలాంటి సంఘటనే జరిగింది.ఓ చిట్టితల్లి ఆడుకోవడానికి బయటకు వెళ్లి, కాసేటి తర్వాత ఇంటికి ఓ అతిథితో వచ్చింది.

ఆ అతిధి ఎవరో తెలిస్తే మీరు అవాక్కవుతారు.తనతో పాటు బుల్లి కూనను వెంట తీసుకొచ్చింది.

అదే పిల్లి కూన. అవును… మొదట ఆ పిల్లి కూనను చూసిన ఇంట్లోవారు సంబరపడగా, కాస్త పరిశీలినగా చూసి అవాక్కయ్యారు.ఎందుకంటే అది పిల్లి పిల్ల కూన కాదు.అది ఓ చిరుత పులి కూన.అయితే ఆ చిరుత పిల్ల రోజుల వయస్సు కావడంతో దాంతో వారు కూడా ఎంజాయ్ చేసారు.ఇక పులి ఆ ప్రాంతంలో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన మహారాష్ట్ర మాలేగావ్ లోని మోర్జార్​ శివరా ప్రాంతంలో జరిగింది.అయితే ఆ కుటుంబ సభ్యులు ఆ పులి పిల్ల విషయంలో కాస్త సాహసమే చేశారు.

కూన కోసం తల్లి వస్తుందేమో అని.దాదాపు వారం రోజుల పాటు టెన్షన్ పడ్డారు.

Telugu Cat Cub, Chettah, Leopard Cub, Maharashtra, Malegaon, Latest-Latest News

అయితే, చిరుత మాత్రం ఆ ప్రాంతంలో సంచరించిన ఆనవాళ్లు కనిపించలేదు.దీంతో ఫారెస్ట్ డిపార్టె‌మెంట్ వారికి సమాచారం ఇచ్చి, అటవీ శాఖ సిబ్బందికి ఆ చిరుత కూనను అప్పగించారు.అయితే ఈ వారం రోజులు పాటు ఆ చిన్నారి ఆ చిరుత పిల్లతో ఎంతో సరదాగా అడ్డుకుందని ఆ కుటుంబం చెప్పుకొచ్చింది.ఈ క్రమంలో దానికి రోజూ వారు పాలు పట్టారు.

దాదాపు రోజుకు లీటరన్నర మిల్క్ ఖర్చయేదట.అయితే కూన కోసం ఆ ప్రాంతానికి చిరుత ఎప్పుడు వస్తుందో అని.మాత్రం ఆ కుటుంబ సభ్యులు కంగారు పడేవారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube