వైరల్: జనాలదగ్గర కటింగ్ ఇద్దామని బైక్ స్టంట్ చేయబోయి ఖంగు తిన్నాడు, చూడండి!

బైక్ తో స్టంట్స్ చేసేందుకు చాలా ధైర్యం కావాలి… అందరూ చేయలేరు.దానికోసం నెలల తరబడి సాధన చేయవలసి ఉంటుంది.

 Viral He Was Going To Do A Bike Stunt To Give A Cutting To The Crowd, Look, Bike-TeluguStop.com

లేకపోతే ప్రాణాలే పోయే పరిస్థితి ఉంటుంది.అందుకే ఇలాంటివి సాధారణ బైకర్లు ట్రై చేయడం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు.

అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో ఒకసారి చూస్తే అదే జరిగింది.అయితే ఇది వరకే అక్కడ ప్రొఫెషనల్ స్టెంట్స్ మాస్టర్స్ సదరు ఫీట్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఎందుకంటే అక్కడ దానికొరకు పెద్ద గుంత ఒకటి తవ్వి వుంది.అయితే అందులోనే మనోడు ఓస్ అదెంత! మనమెందుకు చేయలేము అని ట్రై చేసాడు.

అక్కడ చుట్టూ వున్న జనం కూడా బాగా చప్పట్లు కొట్టడంతో మనోడు బాగా ఖుషి అయిపోయి తన బైక్ ని తీసుకున్నాడు.అతడు అలా బైక్ నడుపుతూ స్టంట్స్ చేసేందుకు ట్రై చేసాడు.తన ప్రతిభను అందరికీ చూపించేందుకు సిద్ధమయ్యాడు.ఈ క్రమంలోనే తను తీసుకున్న బైక్ ని ఒక్కసారి స్పీడు పెంచి ఆ గుంత అంచు వెంబడి స్పీడుగా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

కానీ.దురదృష్టవశాత్తు బైక్ కంట్రోల్ తప్పి, ఆ గుంతలో పడిపోయింది.

దీంతో అతను కూడా నేరుగా బావిలో పడిపోవడం ఇందులో స్పష్టంగా కనబడుతోంది.

కాగా ఈ ఘటనలో అతనికి గాయాలైనట్లు తెలుస్తోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో.ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ కాగా నెటిజన్లు చాలామంది రకరకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఇలాంటి డేంజర్ స్టంట్స్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది సూచిస్తుండగా….కొంతమంది మాత్రం, ‘అలవాటు లేనివారు ఊరికే గొప్పల కోసం ఇలా ఎందుకు చేస్తారో ఆ దేవుడికే తెలియాలి!’ అంటూ చురకలు అంటిస్తున్నారు.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని మీరు కూడా చూసి అభిప్రాయాన్ని తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube