వైర‌ల్‌.. చావు అంచుల దాకా వెళ్ల‌డం అంటే ఇదేనేమో..

ప్ర‌మాదం ఎప్పుడు ఎటు నుంచి ఎలా వస్తుందో చెప్ప‌డం ఎవ్వ‌రి త‌రం కాదు.అది వ‌స్తువు రూపంలో వ‌స్తుందో లేదంటే జంతువు రూపంలో వ‌స్తుందో లేదంటే ప్ర‌మాదం రూపంలో వ‌స్తుందో చెప్ప‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు.

 Viral Is This What It Means To Go To The Brink Of Death, Viral Video, Snake, Sna-TeluguStop.com

అందుకే మ‌నిషి జీవితం గ్యారంటీ లేన‌ద‌ని చెబుతారు.ఎంతో ఆశ‌లు పెట్టుకున్నా కూడా మ‌ర‌ణం ఎప్పుడు ఎలా సంభ‌విస్తుందో ఎవ‌ర‌మూ చెప్ప‌లేం.

అయితే కొన్ని ఇలాంటి అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటే.ఇలాంటి ప్ర‌మాదాల నుంచి ల‌క్కీగా ఎస్కేప్ అయిన వారు కూడా ఉన్నారు.

అలాంటి వారిని చూసిన‌ప్పుడు ఎంత అదృష్ట వంతుడో క‌దా అని అనిపిస్తుంది.అయితే ఇలాంటి అనుకోని ఘ‌ట‌న‌ల‌కు మామూలుగానే సోష‌ల్ మీడియాలో విప‌రీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటుచేసుకుంది.ఈ వీడియో చూశాక అత‌ను ఎంత ల‌క్కీనో అంటారు.

పాముల‌కు సంబంధించిన వార్త అంటేనే ఒకింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.కానీ అవి ద‌గ్గ‌ర‌కు వ‌స్తే మాత్రం భ‌యం పుడుతుంది.

అయితే ఇప్పుడు ఓ వ్య‌క్తి ఓ చోట కూర్చోగా అత‌ని ద‌గ్గ‌ర‌కు ఓ పాము వ‌స్తుంది.అక‌స్మాత్తుగా అత‌ని ఒడిలోకి కూడా వెళ్తుంది.

దాన్ని చేఊసిన వ్య‌క్తి చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాడు.దానికి ఎలాంటి హాని చేయ‌కుండా అదే స‌మ‌యంలో త‌న ప్రాణాల‌కు ముప్పు లేకుండా చూసుకుని దాని నుంచి త‌ప్పించుకున్నాడు.త‌న చేతికి ద‌గ్గ‌ర‌లో ఉన్న‌టువంటి క‌ట్టెపుల్ల‌ను ప‌క్క నుంచి ఆ పాముకు క‌నిపించేలా తిప్పాడు.దీంతో ఆ పాము త‌న దిశ‌ను మార్చుకుని ఆ వ్య‌క్తి ఒడిలోంచి కింద‌కు వెళ్తుంది.

అలా అత‌ను దానికి ఎలాంటి హానీ చేయ‌కుండా పంపించేశాడు.కానీ అది కాటు వేస్తే ఇంకేమైనా ఉందా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.

ఎంతైనా అత‌ను అదృష్ట వంతుడు అని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube