వైరల్: ప్రపంచంలోనే పెద్ద అరటిపండు ఇదేనా..!?

ప్రపంచంలో వింతలు, అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి.ఇక బొప్పాయి పండులో వినాయకుడి రూపం కనిపించిన రోజులు కూడా ఉన్నాయి.

 The Largest Banana In The World Is Found In England, Very Big Banana, Large Bana-TeluguStop.com

ప్రకృతి అలాంటి వింతలు చేస్తూ ఉంటుంది.అయితే అంత పెద్ద అరటిపండును చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

తాజగా అలాంటిది ఒకటి ఇంగ్లండ్‌లో జరిగింది.దాని పొడువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇంగ్లండ్‌ లో పౌలా అనే మహిళ నివాసం ఉంటుంది.ఆమె వయసు 45 ఏళ్లు.ఇంట్లోకి సామాన్ల కోసం షాపింగ్‌కి వెళ్లింది.

ఇంటికి వచ్చింది.ఒక్కో సామానునూ సంచిలోంచీ తీస్తుంటే… సడెన్‌గా ఆమె కళ్లు అరటిపండ్లపై పడ్డాయి.

ఎందుకంటే వాటిలో ఓ అరటిపండు మిగతా వాటి కంటే చాలా పెద్దగా ఉంది.ఇంత పెద్ద అరటి పండును నా జీవితంలో చూడలేదు.

అను ఆమె తెలిపింది.ఇది మామూలు అరటి పండ్ల కంటే 2, 3 రెట్లు పెద్దగా ఉంది అని చెప్పింది.

కానీ ఆ 12 అంగుళాల బనానా చాలా రుచికరంగా ఉంది అని ఆమె తెలిపింది.

Telugu Inches, Banana, England, Paula, Potassium, Sammi, Meida, Big Banana-Lates

అయితే పౌలా కొడుకు సమ్మీ, అమ్మతోపాటూ సూపర్ మార్కెట్‌కి వెళ్లాడు.ఇంటికి రాగానే స్కూలుకు వెళ్లిపోయాడు.సాయంత్రం ఇంటికి వచ్చాక… తల్లి చూపించిన అరటిపండును చూసి షాక్ అయ్యాడు.

సూపర్ మార్కెట్‌లో ఉన్నప్పుడు తాను దాన్ని గమనించలేదనీ… ఇప్పుడు చూస్తే చిత్రంగా ఉందని తెలిపాడు.

ఆమె కొన్ని రోజుల కిందట అరటిపండ్లు కొన్నాను.

అవి మామూలు సైజులోనే ఉన్నాయి.అదువల్ల తాజాగా తెచ్చిన అరటిపండు ఎంత సైజు ఉందో మిగతావాటితో పోల్చి చూశాను.

ఇది చాలా పెద్దగా ఉంది అని సమ్మీ తెలిపాడు.దీనిపై పరిశోధకులు ఏమంటున్నారంటే… ఆ అరటిపండుకు రోజువారీ పొటోషియం అందాల్సిన దాని కంటే ఎక్కువగా అంది ఉంటుందనీ… అందుకే అది అంతలా పెరిగి ఉంటుందని అంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి.ఎందుకంటే ఆ ఫొటోల్లోని అరటిపండు చాలా పెద్దది ఉంది.ఎంత పెద్దది అంటే… ఆమె అరచెయ్యి అంత ఉంది.అది చూసిన సోషల్ మీడియా నెటిజన్లు కూడా వావ్ అంటున్నారు.

అది ఒక్కటి తింటే పొట్ట నిండిపోతుంది అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube