వైరల్: సైనికుడి ప్రాణాలను కాపాడిన ఐఫోన్‌.. ఎలాగో తెలుసా?

ఐఫోన్ అనేది కుర్రకారుకి కలల ఫోన్.దానికోసం వారు ఎంతైనా వెచ్చిస్తారు.

 Viral  Iphone That Saved A Soldier S Life Do You Know How , Viral Latest, News V-TeluguStop.com

దాని ప్రత్యేకత అలాంటిది మరి.ఇక బడాబాబులు దీనిని షో చేసేందుకే వాడుతారనే విషయం విదితమే.అయితే అదే ఫోన్ తాజాగా ఓ సైనికుడి ప్రాణం కాపాడింది.ఈ ఘటన జరిగింది ఉక్రెయిన్‌ దేశంలో.ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.తాజాగా రష్యా బలగాలు ఓ ఉక్రెయిన్ సైనికుడిపైన తూటాల వర్షం కురిపించారు.

అయితే అతడి బ్యాగులో ఉన్న ఐఫోన్‌ అతడి ప్రాణాలు కాపాడింది.ప్రజంట్ ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

ఎలాగో ఇపుడు చూద్దాం.

ఈ క్రమంలో సాగిన ఫైరింగ్ లో ఓ బుల్లెట్ అతనివైపు దూసుకెళ్లింది.

ఆ సమయంలో సైనికుడి బ్యాగులో ఉన్న 2019 మోడల్‌ ఐఫోన్‌ 11ప్రోకు బుల్లెట్ తగిలి అది ధ్వంసం అయింది.కానీ అతడి ప్రాణాలకి ఎలాంటి హాని కలుగలేదు.

అదే బుల్లెట్ నేరుగా ఆ సైనికుడికి తగిలి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.అదే విషయం ఇక్కడ వున్న వీడియోలో మనకు కనిపిస్తోంది.

ఆ బులెట్ తాకిడికి ఆ ఫోన్ డామేజ్ అవ్వడం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది.కాగా ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.“స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన మెటీరియల్‌తో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇది చాలా ఈజీనే కదా!” అని ఒకరు, “ఐఫోన్‌ చివరకు ఏదో ఒక పనికి ఉపయోగపడింది.సంతోషం!” అని మరొకరు పేర్కొన్నారు.రష్యా ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో “ప్రత్యేక సైనిక చర్య”ని ప్రారంభించింది.

అయితే నేటికీ ఈ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పటికే అనేక ప్రాంతాలను హస్తగతం చేసుకుంది పుతిన్‌ సైన్యం.

ఈ క్రమంలో ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ ని మనం కొనియాడకుండా ఉండలేం.