వైరల్: సముద్రగర్భంలో వినూత్న వివాహం..!

సముద్రంపై పెళ్ళిళ్ళు, బర్త్ డే పార్టీలు జరుపుకునే ప్రజలను చూసే ఉంటాం కానీ సముద్రం లోపలికి వెళ్లి పెళ్లి చేసుకున్న జంట ని మాత్రం అసలు ఎప్పుడూ చూసి ఉండం.కానీ తమిళనాడులోని చెన్నై శివార్లలో నీలంగరై సముద్రతీరంలో ఐటీ ఇంజనీరింగ్ జంట 60 అడుగుల నీటి లోపలికి వెళ్లి పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.

 Viral Innovative-marriage On The  Seabed   Viral Latest, Viral News, Sea, Birthd-TeluguStop.com

పట్టు చీర, ధోతి కట్టుకొని పూల దండలు వేసుకొని ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఒక అద్భుతమైన ఫోటో దిగి తమకు పెళ్లైనట్టు వెల్లడించిన ఈ దంపతులు మీడియాతో మాట్లాడుతూ సముద్ర గర్భంలో పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉందని చెబుతున్నారు.

సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయని దీని వలన సముద్ర జీవులు చనిపోతున్నాయని సముద్రాలను రక్షించడం మనందరి బాధ్యత అని గుర్తు చేయడానికే తాము సముద్రగర్భంలో పెళ్లి చేసుకున్నామని చెబుతున్నారు.

పూర్తి వివరాలు తెలుసుకుంటే తిరువణ్ణామలైకి చెందిన చిన్నదురై చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు.ఆయనకు కోయంబత్తూరుకు చెందిన శ్వేతతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు.అయితే ఓ స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్ చిన్నదురై కి సముద్రగర్భంలో పెళ్లి చేసుకోవాలని ఐడియా ఇచ్చారు.ఆ ఐడియా నచ్చడంతో చిన్నదురై సముద్రం లోపల పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ పెళ్లికూతురు అయిన శ్వేతా మాత్రం అందుకు చాలా భయపడింది.

సముద్రం లోపలకి వెళ్లి పెళ్లి చేసుకునేందుకు ఆమె స్విమ్మింగ్ కూడా నేర్చుకుంది.చాలా రోజులపాటు స్విమ్మింగ్ నేర్చుకొన్న ఆమె ధైర్యం వచ్చిన తర్వాత సముద్రంలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది.

అయితే సముద్రం ప్రశాంతంగా ఉందని ఆదివారం రోజు లోకల్ మత్స్యకారుల నుంచి తెలుసుకున్న వీళ్లిద్దరు సోమవారం ఉదయమే నీలంగరై సముద్రతీరానికి వెళ్లి ఆక్సిజన్ సిలిండర్లు ధరించి 60 అడుగుల లోపలికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.అయితే సముద్ర జీవరాశుల మధ్య పెళ్లి చేసుకోవడం ఒక సరికొత్త అనుభూతిని కలిగించింది అని పెళ్లికూతురు శ్వేతా చెబుతోంది.45 నిమిషాల పాటు సముద్రంలోపలే ఉన్నామని.తమకు ఇది ఓ మంచి లైఫ్ ఎక్స్పీరియన్స్ అని ఈ ఐటీ ఇంజనీరింగ్ దంపతులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube