వైరల్ : కేవలం 27 సెకన్లలోనే.. బిడ్డను జననం..!

పురిటి నొప్పుల సమయంలో ఒక్కోసారి బిడ్డను కనే క్రమంలో నొప్పులను తల్లి తట్టుకోలేదుఆమె శరీరం అందుకు సహకరించదనే స్థితిలో సిజేరియన్ చేసి బిడ్డలను బయటకు తీస్తారు.సహజంగా జరిగే ప్రక్రియ ఇది.

 Viral In Just 27 Seconds The Baby Is Born-TeluguStop.com

అయితే ఎటువంటి ప్రసవ వేదనా లేకుండా ఓ తల్లి బిడ్డను కనేసింది.ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది.

కేవలం 27 సెకెన్లలో బిడ్డకు జన్మనిచ్చి ఔరా అనిపించుకుంది.ఇంగ్లాండ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.29 ఏళ్ల సోఫీ బగ్ ఉదయం 4 గంటలకు టాయిలెట్ కు వెళ్ళింది.38 వారాల గర్భవతి అయిన ఆమె టాయిలెట్ కు వెళ్ళిన ఒక్క నిమిషంలో బిడ్డతో తిరిగి వచ్చింది.

 Viral In Just 27 Seconds The Baby Is Born-వైరల్ : కేవలం 27 సెకన్లలోనే.. బిడ్డను జననం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిడ్డతో వచ్చిన ఆమెను చూసి తన భర్త అవాక్కయ్యాడు.వెంటనే డాక్టరుకు ఫోన్ చేశాడు.డాక్టరు ఫోనులో చెప్పిన విధంగా బొడ్డుతాడు కోశాడు.ఆ తరువాత తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు.

అక్కడ మూడుగంటల పాటు ఆమెకు వైద్య సహాయం అందించి తరువాత ఇంటికి క్షేమంగా పంపించారు.ఇలా ఇంత త్వరగా బిడ్డ పుట్టడం జరగడం ఇదే మొదటిసారి కాదు.గతంలోనూ ఆమె ఇదే విధంగా తన బిడ్డలకు జన్మ ఇచ్చింది.2013 లో తన మొదటి బిడ్డ గర్భంలో ఉండగా ఒకరోజు అర్ధ రాత్రి ఇలానే టాయిలెట్ కు వెళ్లిన సమయంలో బిడ్డకు జననం ఇచ్చింది.అయితే, అప్పుడు 12 నిమిషాలు బిడ్డను కనడానికి సమయం పట్టింది.తరువాత బిడ్డ కూడా ఇలానే తండ్రి చేతుల్లోనే పుట్టేసింది.దీనిపై బిడ్డ తల్లి సోఫీ బగ్మాట్లాడుతూ తనకు అసలు పురిటి నొప్పులే తెలియవని పేర్కొంది.అన్ని కాన్పులలోనూ తన భర్త తన పక్కనే ఉండటం సంతోషాన్ని కలిగించిందని తెలిపింది.

బిడ్డలను తన భర్తే రక్షించి బొడ్డుతాడు కోశారని, అది తనకు ఎంతో సంతోషాన్ని కలిగించినట్లు తెలిపింది.

#27 Seconds #Social Media #Birth #Fastest Birth #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు