వైరల్: ఆ భోజనం పూర్తి చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ మీ సొంతం..!

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా హోటల్స్, రెస్టారెంట్స్ తీవ్ర నష్టానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే.ఇక గత కొద్ది కాలం నుంచి మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్న హోటల్స్, రెస్టారెంట్స్ కస్టమర్ ఆకట్టుకునేందుకు విన్నూత్న రీతిలో ఆఫర్లను ప్రకటిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

 If You Finish This Meal Then Royal Enfield Is Yours, Bullet Meal, Full Meals, No-TeluguStop.com

తాజాగా అలాంటి సంఘటన ఒకటి పుణె లో చోటు చేసుకుంది.

ఆ ఆఫర్ ఏమిటిని అనుకుంటున్నారా.? వారు పెట్టే భోజనం పూర్తిగా చేసిన వారికి బుల్లెట్ బైక్ గిఫ్ట్ గా ఇస్తామని రెస్టారెంట్ యజమాని తెలియజేశాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

Telugu Bullet Bike, Bullet Meal, Bumper, Full Meals, Gift, Veg, Pune-Latest News

పూణేలోని శివాజీ హోటల్ యజమాని అతుల్ వాకర్ 60 నిమిషాలలో 4 కిలోల నాన్ వెజ్ భోజనాన్ని పూర్తిగా బుజిస్తే వారికి 1.65 లక్షల విలువ చేసే బుల్లెట్ బైక్ ను బహుమతిగా ఇస్తామని ఆఫర్ ను తెలియజేశాడు.ఈ సందర్భంగా పోటి కోసం ఐదు కొత్త బుల్లెట్ బైక్ లను రెస్టారెంట్లో సిద్ధంగా ఉంచినట్లు యజమాని పేర్కొన్నాడు.

ఇందుకు సంబంధించి బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు, బుల్లెట్ భోజనంలో ఏమేమి ఆహార పదార్థాలు ఉంటాయిని మెనూ కూడా క్లియర్ గా తెలియజేశారు.వీటితో పాటు అలాగే నిబంధనలు కూడా వివరంగా వివరించారు.

బుల్లెట్ భోజనంలో మొత్తం 12 రకాల వంటకాలు 4 కేజీల బరువు ఉంటాయి.అందులో ఏవేవి ఉన్నాయి అంటే.

ఫ్రైడ్ సుర్మై, పొంఫ్రెట్ ఫ్రైడ్​ ఫిష్​, చికెన్ తందూరి, డ్రై మటన్​, గ్రే మటన్​, చికెన్ మసాలా, రొయ్యల బిర్యానీ ఇలా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు ఉండడం విశేషం.ఈ ఆఫర్ ప్రకటించడంతో అనేకమంది స్పందించి చాలెంజ్ పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నారని తెలియజేశాడు.

ఇందులో భాగంగా ఈ బుల్లెట్ భోజనం ధర 2500 రూపాయలు ఉంటుందని, అలాగే ఇప్పటి వరకు ఈ పోటీలలో నిలిచిన ఒకరు బుల్లెట్ బైక్ ను కూడా సొంతం చేసుకున్నారట.ఇక ఆ వ్యక్తి మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన వ్యక్తికి రెస్టారెంట్ యజమాని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube