వైరల్: అదేదో పనికిరాని మెయిల్ అనుకుంది.. కానీ., నిజంగానే 22 కోట్లు గెలుచుకున్న మహిళ..!

లాటరీలు కొనుక్కునే అలవాటు ఉన్న వాళ్ళని మనం చాలామందినే చూసి ఉంటాము.ఒక్కొక్కళ్ళకి ఒక్కో వీక్ నెస్ ఉంటుంది.

 Viral: I Thought It Was Useless Mail But, The Woman Who Really Won 22 Crores, Viral Latest, Viral News, Social Media, Lottery, Mail, Laura Spears, Auckland County-TeluguStop.com

ఉన్న డబ్బులతో లాటరీలను కొని ఎప్పటికప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు చాలామంది.లాటరీ తగిలితే తెల్లారే సరికల్లా వాళ్ళ దశ తిరిగిపోతుంది.

ఒకవేళ తగలకపోతే లాటరీ కొనడం మానేస్తారా అంటే అది జరగదు.లాటరీ తగిలిన, తగలకపోయినా నెల నెల లాటరీలను కొనే వాళ్ళు అమెరికాలో చాలా మందినే ఉన్నారు.

 Viral: I Thought It Was Useless Mail But, The Woman Who Really Won 22 Crores, Viral Latest, Viral News, Social Media, Lottery, Mail, Laura Spears, Auckland County-వైరల్: అదేదో పనికిరాని మెయిల్ అనుకుంది.. కానీ., నిజంగానే 22 కోట్లు గెలుచుకున్న మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక మహిళ కొన్న లాటరీ వలన ఆమెకు అదృష్టం దురదృష్టం పట్టినట్టు పట్టిందనే చెప్పాలి.దాంతో ఆమెకు ఏకంగా రూ.22 కోట్లు వచ్చి పడ్డాయి.ఇంకా కొన్ని రోజులు ఆలస్యం అయితే కనుక ఆమెకి రావలిసిన డబ్బులు వచ్చేవి కావు.

నిజంగానే ఆమెకు ఎక్కడో సుడి ఉందనే చెప్పాలి.ఎందుకంటే స్పామ్ మెయిల్స్ వస్తే అవేవో పనికిరాని మెయిల్స్ అనుకుని వాటిని కనీసం ఓపెన్ కూడా చేయకుండా అలాగే వదిలేస్తాము.

ఎందుకంటే ఈ-మెయిల్స్ లో డబ్బు గెలిచినట్లు వచ్చే మెసేజ్ లు 99% నకిలీ మెయిల్సే అవుతాయని.అటువంటి ఈమెయిల్స్ ను నకిలీవిగా భావిస్తూ నకిలీ ఫోల్డర్ లోకి పంపిస్తాయి.

సరిగ్గా ఆ మహిళ విషయంలో కూడా అదే జరిగింది.కాకపోతే.

నిజమైన మెయిల్ కాస్తా స్పామ్ ఫోల్డర్ లోకి వెళ్లిపోయింది అంతే.లక్కీగా ఆమె మెయిల్ చెక్ చేసుకోబట్టి అసలు విషయం ఆమెకు తెలిసింది.

మరి ఆ అదృష్ట దేవత ఎవరో ఏంటో అనే వివరాలు తెలుసుకుందామా.

ఆ మహిళ పేరు లారా స్పియర్స్.

ఆమె వయసు 55 ఏళ్లు.ఆమె అమెరికాలోని ఆక్లాండ్ కౌటీలో ఉంటోంది.

డిసెంబర్ 31న మిచి గాన్ లాటరీ డాట్ కామ్ లో మెగా మిలియన్స్ డ్రాయింగ్ లో టికెట్ కొన్నది.అలా ఒక మిలియన్ మనీ గెలుచుకుంది.

అయితే అక్కడ మెగాప్లైయర్ అనే ఆప్షన్ ఉన్న కారణంతో 1 మిలియన్ కాస్త ఏకంగా 3 మిలియన్లు అయ్యింది.అంటే దాదాపు 22 కోట్లు అన్నమాట.

ఇంతకీ ఆ లాటరీ టికెట్ ధర ఎంతో తెలిస్తే మీరే షాక్ అవుతారు.ఆ లాటరీ టికెట్ ధర కేవలం 150 రూపాయిలు మాత్రమే.

అంటే ఆ మహిళ కేవలం 3 డాలర్లతో ఏకంగా రూ.22 కోట్లు సాధించినట్లైంది.అలా టికెట్ కొని ఇక దాని గురించి మర్చిపోయి తన రోజువారీ పనుల్లో లీనం అయిపోయింది.మామూలుగానే ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉండగా స్పామ్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే మెగా మిలియన్స్ జాక్ పాట్ అనే మెయిల్ కనిపించింది.

దాంతో తాను టికెట్ కొన్న విషయం గుర్తొచ్చి స్పామ్ మెయిల్ ఓపెన్ చేసి ఆశ్చర్యపోయింది.తానే విన్నర్ అని తెలిసి షాక్ అయ్యింది.ఇదంతా నిజామా.కాదా అనే డౌట్ వచ్చి నేరుగా లాటరీ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకుని కన్ఫామ్ చేసుకుంది.

అంతే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈనెల 20న లాటరీ సంస్థ కార్యాలయానికి వెళ్లిన స్పియర్స్ ఆమెకు వచ్చిన బహుమతిని తీసుకుంది.

ఇంకా తాను రిటైర్ అయ్యే సమయం వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేసింది.స్పీయర్స్ వచ్చిన డబ్బును తన ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేసుకుంటానని వివరించింది.

అయితే లాటరీలో డబ్బులు వచ్చే మాట నిజమే కానీ ఆ అదృష్టం ఒక్కళ్లకే వస్తుంది.కానీ ఆ లాటరీ టికెట్ కొనే వాళ్ళు మాత్రం కోట్ల సంఖ్యలో ఉంటారని గుర్తుపెట్టుకోవాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube