వైరల్: యాచకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. చివరకి..?!

తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేని వారు ఎక్కువగా యాచకులుగా మారుతారు.గుడి దగ్గర లేదా బస్టాండ్, మార్కెట్ ఇలా జనం ఎక్కువగా వచ్చే చోట బిక్షాటన చేస్తూ బ్రతికేస్తుంటారు.

 Viral  Huge Bundles Of Notes In The Beggar's House  Finally, Begger, Laskhs, Vir-TeluguStop.com

ఆహారం దొరక్క కడుపు కాలి చనిపోయేవారు కూడా ఉంటారు.ఇక కొంతమంది బిక్షాటన చేసి లక్షలు, కోట్లు కూడబెట్టారని అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తుంటాం.తాజాగా తిరుపతిలోని ఓ యాచకుడి ఇంట్లో రూ.6 లక్షలు బయటపడ్డాయి.దీంతో అందరూ షాకయ్యారు.బిక్షాటన చేసే వాడి ఇంట్లో ఇన్ని డబ్బులేంటని ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే.శ్రీనివాసన్ అనే యాచకుడు తిరుమలలో బిక్షాటన చేస్తూ జీవించేవాడు.

చాలా ఏళ్ల పాటు అతడు తిరుమల కొండపైనే నివసించాడు.అతడిని తిరుమల నిర్వాసితుడిగా భావించిన అధికారులు అతడికి నగరు శివారులోని శేషాచల కాలనీలో ఓ ఇల్లును కేటాయించారు.

కొన్ని రోజులకు శ్రీనివాసన్ అనారోగ్యంతో మృతిచెందాడు.అతడికి కుటుంబ సభ్యులు, వారసులెవరూ లేకపోవడంతో.

టీటీడీ సిబ్బంది అతడికి కేటాయించిన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు.

యాచకుడు శ్రీనివాసన్ ఇంట్లోకి వెళ్లిన అధికారులకు షాక్ తగిలింది.

రెండు పెట్టెల్లో భారీగా నగదు కనిపించింది.ఓ యాచకుడి ఇంట్లో ఇంత డబ్బు ఉండటం ఏంటని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి నగదును లెక్కించారు.శ్రీనివాసన్ తిరుమల కొండపై చాలా రకాలుగా డబ్బు సంపాదించే వాడని తెలిసింది.ఆ పెట్టెల్లో కొన్ని పాత రూ.500, రూ.1000 నోట్లు, కొత్త రూ.2వేల నోట్లు కూడా ఉన్నాయి.దాదాపు 5 మంది సిబ్బంది ఆ డబ్బును లెక్కించారు.ఆ నగదు విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

ఓ యాచకుడి వద్ద ఇంత డబ్బు ఉందంటే ఎవరూ నమ్మరు.

బిక్షాటన చేస్తూ జీవించే వాడిని ఎవరైనా అనుకుంటారు.కానీ యాచకుడు శ్రీనివాసన్ మాత్రం లక్షాధికారి అని తేలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube