వైరల్: ఈ ముసలి బామ్మ టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగిస్తుందో కదా..!

రోజు రోజుకి పెరుగుతున్న  టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎంతో మంది చాలా అద్భుతాలు సృష్టిస్తున్న సంగతి అందరికీ విధితమే.ప్రస్తుతం ఉన్న అభివృద్ధి టెక్నాలజీని ఉపయోగిస్తూ కొంతమంది నేరాలకు పాల్పడుతూ ఉంటే, మరికొందరు మాత్రం మంచి పనులకు ఉపయోగిస్తూ ప్రశంశలు పొందుతున్నారు.

 Viral How Well Does This Old Grandmother Use Technology-TeluguStop.com

తాజాగా ఒక బామ్మ‌ ఉపయోగించిన టెక్నాలజీ అందరినీ అబ్బుర పరుస్తోంది.

సాధారణంగా ఎవరైనా సరే మొక్కజొన్న కంకులను బొగ్గు సహాయంతో కాలుస్తూ, వినియోగదారులకు అమ్మడం వంటివి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral How Well Does This Old Grandmother Use Technology-వైరల్: ఈ ముసలి బామ్మ టెక్నాలజీని ఎంత బాగా ఉపయోగిస్తుందో కదా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఐతే బెంగుళూరు కు చెందిన ఈ  బామ్మ మాత్రం టెక్నాలజీని బాగా ఉపయోగిస్తూ ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.దీనికి కారణం ఓ సోలార్ ప్యానెల్  ఆధారంగా సులువుగా మొక్కజొన్న కంకులను కాలుస్తోంది.

ఆ బామ్మా  అమ్ముకునే కంకుల బండి పై ఒక సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసి దానితో పాటు పక్కనే ఒక చిన్న ఫ్యాన్ ను కూడా ఏర్పాటు చేసుకొని సోలార్ ప్యానెల్ సహాయంతో నడిచే ఆ ఫ్యాన్ గాలితో బొగ్గులు చాలా సులువుగా ఇట్లే కాలుస్తోంది.అంతేకాకుండా సాయంకాలం సమయంలో బండికి కావాల్సిన లైట్లు కూడా ఆ సోలార్ ప్యానల్ తోనే ఏర్పాటు చేసుకుంది ఈ బామ్మ.

ఈ సన్నివేశాన్ని చూసిన ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశాడు.75 సంవత్సరాలు ఉన్న సెల్వ‌మ్మ ఐడియా అదుర్స్ అంటూ వివిఎస్ లక్ష్మణ్ ఆ బామ్మను  కొనియాడాడు.ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

మీతో కూడా ఇలాంటి నవతరం ఐడియా లో ఉండే వాడిని ఇలా కష్టపడే వారికి అందించి వారికి సహాయపడండి.

#Wonderful #Selvamma #High Tech #RegulatedFan #Bangalore

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు