వైరల్: పట్టపగలు దొంగలు దొంగతనం చేయడానికి ఎలా ట్రక్ పై ఎగబడ్డారంటే..?!- Viral How Did The Daytime Thieves Get On The Truck To Steal

Viral How did the daytime thieves get on the truck to steal , Viral, theifts, truck, VirAl post, viral latest, viral video, social media - Telugu Social Media, Theifts, Truck, Viral, Viral Latest, Viral Post, Viral Video

చోరీలకు పాల్పడుతున్న దొంగల అనూహ్యమైన తెలివితేటలకు సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్న దొంగలకు బాధితులు అవ్వటం ఖాయం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

 Viral How Did The Daytime Thieves Get On The Truck To Steal-TeluguStop.com

అయితే కొందరు దొంగలు ఎవరూ ఊహించని రీతిలో చోరీలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.మధ్యప్రదేశ్ లో ముగ్గురు దొంగలు అచ్చం హాలీవుడ్ సినిమాల్లో చూపించిన విధంగా చోరీకి పాల్పడి అందరిని విస్తుపోయేలా చేస్తున్నారు.

హాలీవుడ్ సినిమాల్లో హీరోలు గానీ విలన్స్ గాని వేగంగా కదులుతున్న ట్రక్స్ లారీల నుంచి దొంగతనాలకు పాల్పడుతున్నారు.కానీ నిజ జీవితంలో అలాంటి రిస్కీ స్టంట్స్ చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

 Viral How Did The Daytime Thieves Get On The Truck To Steal-వైరల్: పట్టపగలు దొంగలు దొంగతనం చేయడానికి ఎలా ట్రక్ పై ఎగబడ్డారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ మధ్యప్రదేశ్ లో ముగ్గురు దొంగలు ద్విచక్రవాహనంపై వెళ్తూ.గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పోతున్న ఓ ట్రక్కు ని ఫాలో అయ్యారు.ఒక దొంగ బైక్ పై నుంచి సరుకులు తరలిస్తున్న ఆ ట్రాక్ లోకి ఎక్కాడు.అనంతరం ట్రక్కు కంటైనర్ కి ఉన్న డోర్ లాక్ ని బోల్ట్ కట్టర్ తో కత్తిరించాడు.

ఆపై లోపలికి వెళ్లి ట్రక్ లోని సరుకులను దొంగిలించడానికి ప్రయత్నించాడు.

ఇదంతా కూడా పట్ట పగలు నిర్మానుష్యంగా ఉన్న ఓ హైవేపై జరిగింది.

ఈ క్రమంలోనే కారులో ప్రయాణించే ఓ వ్యక్తి దొంగల చోరీకి సంబంధించిన దృశ్యాలను వీడియో తీశాడు.ఆ ట్రక్ లో ఏదో ఆయిల్ ఉన్నట్టు గా ఆయన చెప్పాడు.

అయితే కార్ లో ఉన్న వ్యక్తి వీడియో తీస్తున్నట్టు గమనించిన దొంగలు వెంటనే వీడియో ఆఫ్ చేసి వెళ్లి పోవాలని చేతులతో సైగలు చేశాలు.కానీ ఆ వ్యక్తి మాత్రం కారు స్పీడ్ పెంచి ట్రక్ డ్రైవర్ కి వెనుక వైపు చోరీ జరుగుతుందని చెప్పాడు.

ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమయ్యింది.దీంతో నెటిజన్లు దొంగల ధైర్యానికి ఫిదా అవుతున్నారు.మరికొందరు నెటిజన్లు దొంగలు డబ్బుకోసం దేనికైనా తెగబడుతున్నారని.వారిని పోలీసులు అరెస్టు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే భారతదేశంలో ఇటువంటి దొంగతనాలు జరగడం చాలా అరుదు.కానీ అమెరికాలో హైవేలపై వెళ్తున్న వాహనాల వెంట పడుతూ దొంగతనాలు చేస్తూ ఉంటారు.నిర్మానుష్యమైన హైవేలపై బారికేడ్లు పెట్టి మరీ దోచుకున్న కరడుగట్టిన నేరస్థులు కూడా ఉన్నారు.కొందరు అర్ధ రాత్రి సమయంలో వాహనాలు అద్దాల పై గుడ్లతో కొడుతూ చోరీలకు పాల్పడుతుంటారు.

#Social Media #Viral #Viral Post #Viral Video #Truck

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు