ప్రేమలో మునిగిన ఇద్దరు యువతులు టిక్ టాక్ రాద్ధాంతం

అమ్మాయిల మధ్య రిలేషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఒకే జెండర్ రిలేషన్ అనేది ఇండియాలో చట్టబద్ధం అయిన తర్వాత చాలా మంది ఓపెన్ గా తమ రిలేషన్ ని వ్యక్తం చేస్తూ వారి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

 Viral Hindu Muslim Lesbian Couple Blasts Tiktok-TeluguStop.com

ఇక భారత్, పాకిస్తాన్ కి చెందిన అంజలి, సుందాస్ మాలిక్ అనే యువతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం, దానికితోడు భారత్, పాకిస్తాన్ కి చెందిన అమ్మాయిలు కావడంతో వారి పెళ్లి వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

ఇక అప్పటి నుంచి వీరికి సోషల్ మీడియాలో ఫలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు.

ఇదిలా ఉంటే అంజలి, సుదాంస్ మరో సారి వార్తల్లోకి ఎక్కారు.

వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియోను కొద్ది రోజుల క్రితం టిక్‌టాక్‌‌లో పోస్ట్ చేశారు.అయితే ఆ వీడియోను టిక్‌టాక్ యాజమాన్యం డిలీట్ చేసింది.దీంతో ఇదేమి న్యాయమంటూ అంజలీ అదే వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసి తన నిరసనను తెలిపింది.అయితే ఇద్దరు లెస్బియన్స్ కావడంతోనే టిక్‌టాక్ సంస్థ వీడియోను డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.

కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినందుకే వీడియోను డిలీట్ చేసినట్టు టిక్‌టాక్ చెప్పడంపై అంజలి ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇద్దరు అమ్మాయిలు కలిసి డ్యాన్స్ చేసినా తప్పేనా ఇదెక్కడి వివక్ష అంటూ సీరియస్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ వీడియోని సపోర్ట్ చేస్తూ అంజలి, సుదాంస్ కి మద్దతుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube