వైరల్: నవ్వు తెప్పిస్తున్న బకెట్ యాడ్... చాలా హార్డ్ గురూ అంటూ, హ హ హ!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలూ విశేషాలు గురించి యిట్టె తెలుసుకుంటున్నాం.వివిధ ప్రాంతాల భాషలు, యాసలు, తిండి, తిప్పలు, వినోదం వంటి ఇంకొన్నో విషయాలను తెలుసుకోగలుతుతున్నాం.

 Viral: Hilarious Bucket Ad Saying Very Hard Guru , Ha Ha Ha, Bucket Ad, Viral Vi-TeluguStop.com

ఈ క్రమంలోనే వినూత్న మార్కెటింగ్ ఆలోచ‌నతో ప్రోడ‌క్ట్‌ను మార్కెటింగ్ చేస్తున్న ఓ బకెట్ యాడ్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మరి ఒక ప్రోడక్ట్ ని అమ్ముకోవ‌డం ఏమంత సుల‌భం కాదనే సంగతి విదితమే.

ఇత‌ర బ్రాండ్ల నుంచి ఎదుర‌య్యే పోటీని అధిగ‌మించాలంటే భిన్న‌మైన ఐడియాతో సో కాల్డ్ కంపెనీలు ప్ర‌క‌ట‌న‌లు రూపొందించ వలసి ఉంటుంది.లేదంటే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోవడం బాగా కష్టతరం అయిపోతుంది.ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశీ ప్లాస్టిక్ బ్రాండ్ అయినటువంటి RFL బ‌కెట్ ఇన్నోవేటివ్ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.IPS అధికారి దీపాన్షు కాబ్ర ఈ క్లిప్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయగా నెటిజన్లను ఆ వీడియో క్లిప్ తెగ అలరిస్తోంది.

ఈ వీడియోలో బకెట్ కోసం యుద్ధమే జరిగిందని చెప్పుకోవచ్చు.లేదులేదు, బకెట్ల మధ్య భీకర పోరు జరిగిందని స్పష్టమౌతోంది.ఇందులో ఒక హీరో స‌ద‌రు కంపెనీకి చెందిన రెడ్ బ‌కెట్ ధ‌రించి విల‌న్ గ్యాంగ్‌పై విరుచుకుప‌డ‌టం క‌నిపిస్తుంది.వీడియో చివ‌రిలో యుద్ధ‌రంగం నుంచి హీరో బ‌య‌ట‌కు వ‌స్తూ త‌న బ‌కెట్ వెప‌న్‌కు థ్యాంక్స్ చెప్పడం గమనించవచ్చు.

ఆ తరువాత ప్రోడ‌క్ట్ గురించిన వివ‌రాల‌తో యాడ్ ముగుస్తుంది.బ‌కెట్ పేరు యూనిక్ కాగా, అత్యంత ధృడ‌మైన బ‌కెట్ అని క్యాప్ష‌న్ ఇవ్వడం ఇందులో చూడవచ్చు.ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి 50,000కు పైగా వ్యూస్ రాబ‌ట్ట‌గా వేల సంఖ్య‌లో యూజ‌ర్లు రియాక్ట్ కావడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube