వైరల్.. గుడ్లు పెడుతున్న కోడి పుంజు..!

ప్రపంచవ్యాప్తంగా రోజువారిగా ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి.అయితే, అవి అన్ని మనకు తెలిసే అవకాశాలు ఇంతకుమునుపు చాలా తక్కువగానే ఉండేవి.

 Viral Hen Laying The Eggs Cock-TeluguStop.com

ఎప్పుడైతే సోషల్ మీడియా ఓ విప్లవం లాగా ప్రజల్లోకి వెళ్లిందో అప్పటి నుంచి వైరల్ కంటెంట్ ద్వారా వింతలన్నీ తెలసుకుంటున్నారు జనాలు.తాజాగా ఓ కోడి పుంజు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.అదేంటీ? కోడి పుంజు వైరల్ అవడమేంటీ? అనుకుంటున్నారా? అవునండీ.మీరు చదివింది నిజమే కోడిపుంజు ఒకటి సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.

కోడిపుంజు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తోంది.ఇంతకీ అసలేం జరిగింది? అనే సంగతి తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదివి తీరాల్సిందే.

 Viral Hen Laying The Eggs Cock-వైరల్.. గుడ్లు పెడుతున్న కోడి పుంజు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి ఇంట్లో నాలుగు కోడిపెట్టలతో పాటు ఒక పుంజు కూడా ఉంది.అయితే, ఇది సాధారణ పుంజు కాదండోయ్ .వెరీ డిఫరెంట్ ఇన్ నేచర్ అని చెప్పొచ్చు.సాధారణంగా కోళ్లు మాత్రమే గుడ్లు పెడతాయి.

కానీ, ఇటీవల ఈ కోడిపుంజు గుడ్డు పెట్టింది.అయితే, మొదట వేరే కోడి గుడ్డు పెట్టిందేమోని సదరు యజమాని అయిన సుబ్రహ్మణ్యం భావించాడు.

కానీ, మరుసటి రోజు కూడా పుంజు గుడ్డు పెట్టడం చూసి సుబ్రహ్మణ్యం షాక్ అయ్యాడు.కోడింపుంజు ఇలా వరుసగా ఐదురోజులు ఐదు గుడ్లు పెట్టడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన అతడు ఓ రోజు కోడిపుంజును పొదిగేశాడు.

Telugu .viral Cock, Andhra Pradesh, Ap, Cock Laying, East Godavari District, Eggs, Five Eggs, Hen, Peddkannalli St Colony, Subramanyam Reddy, Tottambedu, Veterinary Officers-Latest News - Telugu

అలా కోడిపుంజు పెట్టిన గుడ్ల నుంచి ఐదు కోడిపిల్లలు జన్మించాయి.అది చూసి కోడిపుంజు ఇలా చేస్తున్నదేంటని? వెటర్నరీ అధికారులకు ఈ విషయం చెప్పాడు.కాగా, జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వెటర్నరీ ఆఫీసర్స్ పేర్కొన్నారు.ఏదైతేనేం కోడి పుంజు కూడా ప్రజెంట్ సోషల్ మీడియా వరల్డ్‌లో సెపరేట్ ప్లేస్ ఏర్పరుచుకుంది.

కోడి మాదిరిగానే కోడిపుంజు కూడా తన పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవడం గమనార్హం.

#Subramanyam #Cock #Andhra Pradesh #Godavari #Eggs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు