ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది నాటి మాట.ఒక ఐడియా కారు రూపురేఖలు మార్చేస్తుంది అనేది ఈనాటి మాట.
అవును, ఆలోచన చేయలేగాని ఈ లోకంలో మనిషి సాధించలేనిది అంటూ ఏదీ వుండదు.కేరళ( Kerala )కు చెందిన ఒక యువకుడు ఇదే విషయాన్ని మరో సారి రుజువు చేసి ఔరా అనిపించాడు.
తన దగ్గర ఉన్న బడ్జెట్ కారు మారుతి 800ని ఏకంగా లగ్జరీ కారు రోల్స్ రాయిస్‌గా మార్చివేసి చూపరులను అవాక్కయ్యేలా చేస్తున్నాడు.ఇంకా కొంతమంది నిజమైన రోల్స్ రాయిస్ ఒనర్లు( Rolls Royce ) అయితే అతగాడి కారుని చూసి కుళ్ళుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా దీనికి ఆ కుర్రాడు ఖర్చు చేసింది కూడా చాలా తక్కువ.కేవలం 45 వేల రూపాయలను అంటే 45 వేల రూపాయలు వెచ్చించి మరీ దీన్ని రూపొందించాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.కాగా ఐదు రోజుల్లో దాదాపు 3 లక్షల వ్యూస్ సంపాదించింది ఆ వీడియో.వివరాల్లోకి వెళితే కేరళకు 18 ఏళ్ల యువకుడు ఆటోమొబైల్ ఔత్సాహికుడు హదీఫ్( Hadif ) ఘనతను సాధించాడు.యూట్యూబ్ ఛానెల్ ట్రిక్స్ ట్యూబ్ ఈ వీడియోను షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

కాగా ఆ మొత్తం కస్టమైజేషన్‌కు రూ.45,000 ఖర్చవుతుందని చెప్పాడు హదీఫ్.విలాసవంతమైన కార్లలాగా మాడిఫై చేయడం ఇష్టమని, అందుకే రోల్స్ రాయిస్ లాంటి కారును, లోగోను సృష్టించానని అతగాడు ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.రోల్స్ రాయిస్ తరహాలో ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్‌ను అమర్చాడు.ఇంకా మెరుగైన ఇంటీరియర్స్, LED DRLలు, పెయింట్ జాబ్‌తో ఇంప్రెసివ్‌గా తయారు చేశాడు.అంతేకాదండోయ్… ‘స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ‘ అని రాసి ఉన్న కార్ బానెట్‌ని కూడా అందించానని హదీఫ్ తెలిపాడు.ఇదంతా కేవలం రూ.45 వేలలోనే చేశానని చెప్పాడు.