వైరల్: డైరీమిల్క్‌ చాక్లెట్‌తో పకోడి ఎపుడైనా ట్రై చేసారా? ఇది చాక్లెట్‌ ప్రియులకోసం!

రుచి సంగతి దేవుడికెరుక గాని, సోషల్ మీడియా ఇపుడు బాగా విస్తరించడంతో రకరకాల రెసిపీలను ఆన్లైన్లో చూసే భాగ్యం కలుగుతోంది.మన చుట్టూ వున్న అనేకమంది పుర్రెకో బుద్ధి.

 Viral Have You Ever Tried Dairy Milk Chocolate Pakodi This Is For Chocolate Lov-TeluguStop.com

జిహ్వకో రుచి అనే నానుడిని నిజం చేస్తూ వుంటారు.నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఫుడ్‌ వ్లాగ్స్‌ అనేవి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఎక్కడో మారు మూల ఉన్న వంటకాలను కూడా యూట్యూబ్‌ ద్వారా అందరికీ పరిచయం చేస్తున్నారు.కొందరైతే వారి స్పెషల్‌ రెసిపీలను నెట్టింట పెట్టి, ట్రై చేయమని చెబుతున్నారు.

అయితే ఈ క్రమంలో కొన్ని మనకు సాధారణంగా అనిపించినప్పటికీ కొన్ని మాత్రం కాస్త వింతగా అనిపిస్తూ ఉంటాయి.ఇక కొన్నైతే ట్రై చేయాలంటే భయం కూడా కలుగుతుంది.

అలాంటి ఒక వంటకం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అసలు అలా ఎలా చేశారంటూ ప్రేక్షకులు మిడుగుడ్లు వేస్తున్నారు.

ఆ వంటకం మనం అప్పుడప్పుడు ఇష్టంగా తింటున్న పకోడి అండీ.అయితే పకోడీలో వింత ఏముంది? అని అనుకుంటున్నారా? అక్కడే వుంది అసలు ట్విస్టు.మీకు ఉల్లిపాయ పకోడీ తెలుసు, చికెన్‌ పకోడీ తెలుసు, పల్లీ పకోడీ తెలుసు.కానీ, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం డైరీమిల్క్‌ చాక్లెట్‌ పకోడి.

అవును, ఇప్పుడు చెప్పుకోబోయేది డైరీమీల్క్ చాక్లెట్‌తో చేసే పకోడీ గురించే.ఒక మహిళ రోడ్‌ సైడ్‌ బండి పెట్టుకోని ఈ చాక్లెట్‌ పకోడీ విక్రయిస్తోంది.

డైరీమిల్క్ చాక్లెట్‌ తీసుకుని పకోడీ కోసం కలిపిన పిండిలో మొత్తం చాక్లెట్‌ని ముంచి సలసలకాగే నూనెలో వేసి బాగా వేయించి తీసి కస్టమర్లకు వేడిగా సర్వ్‌ చేయడం ఈ వీడియోలో మనం చూడవచ్చును.అంతేకాకుండా ఆ చాల్కెట్‌ పకోడీలోకి మింట్‌ చట్నీ కూడా ఇవ్వడం విశేషం.

కాగా ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.ఇక ఈ చాక్లెట్‌ పకోడీ కొంతమందికి నచ్చితే మరికొంతమందికి అస్సలు నచ్చలేదు.

మీరు కూడా ఒకసారి ఈ వీడియోని తిలకించి చెప్పండి!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube