వైరల్: ఇంత పెద్ద అనకొండ ను మీరు ఎప్పుడైనా చూసారా..?

Viral Have You Ever Seen Such A Big Anaconda

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు హల్ చల్ చేస్తూనే ఉంటాయి.ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోల గురించి అయితే చెప్పనవసరం లేదు.

 Viral Have You Ever Seen Such A Big Anaconda-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఒక అనకొండ సంబందించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఈ భారీ అనకొండను చుసిన నెటిజన్లు నోరు వెళ్లబెడుతున్నారు.

ఎవరికయినా సరే పాములను చూస్తే భయం వేస్తుంది.పాము పేరు వింటే చాలు ఆమడ దూరం పరుగెత్తాలిసిందే.

 Viral Have You Ever Seen Such A Big Anaconda-వైరల్: ఇంత పెద్ద అనకొండ ను మీరు ఎప్పుడైనా చూసారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా మనం చూసే పాములు మహా అయితే ఒక 10 నుంచి 15 అడుగులు ఉంటాయి.అదే అనకొండ అయితే మరికొంచెం పొడవుగా లావుగా ఉంటాయి.

కానీ ఈ వీడియోలో చూసే ఆనకొండ మాత్రం అన్నిటికన్నా భిన్నంగా 32 అడుగులు పొడవు ఉంది.ఇంత పొడవైన అనకొండను చూసి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్ అవుతున్నారు.

ఒక అడవి ప్రాంతంలో ఈ భారీ అనకొండను కొంతమంది స్థానికులు గుర్తించి క్రేన్ సహాయంతో పట్టుకోవాలని చూసారు.అయితే వాళ్ళు కూడా ఆ అనకొండ ఎంత పొడవు ఉందో అనేది గమనించలేదు.

తీరా క్రేన్‌ సహాయంతో దాన్ని పట్టుకుని పైకి లేపగానే దానిని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

వామ్మో ఇంత పెద్ద అనకొండ అని భయపడిపోయి నోరు వెళ్ళబెట్టారు.ఆ భారీ కొండచిలువ దాదాపు 32 అడుగుల పొడవు ఉంది.దానిని చూస్తేనే అర్ధం అవుతుంది జంతువులు, మనుషులు అనే తేడా లేకుండా ఎవరిని అయినాసరే ఇట్టే మింగేయగలదు అని.ప్రస్తుతం ఈ భారీ కొండచిలువకు సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో ఇప్పటిది అయితే కాదు.

పాత వీడియోనే అయినా కానీ మరోసారి నెట్టింట్లో వైరల్ గా మారింది.

#Python

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube