వైరల్: ఇలాంటి బల్లి ని ఎప్పుడైనా చూసారా..?!

మనం ప్రతిరోజు గోడలపై పాకే బల్లులను చూసాం కానీ ఎగిరే బల్లులను చూడటం చాలా అరుదు.నిజానికి ఎగిరే బల్లులు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయే ఎందరో ఉంటారు.

 Have You Seen This Flying Lizard, Uttarakhand, Lokesh Poojari, Lizard, Vireal La-TeluguStop.com

కానీ ఒక ఎగిరే బల్లి ఎక్కడో కాదు మన భారతదేశంలోనే కనిపించింది.శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం ప్రపంచంలో ఎగిరే బల్లులు ఎన్నో ప్రాంతాల్లో నివసిస్తున్నాయి.

ఐతే తాజాగా ఒక ఎగిరే బల్లి ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో కనిపించి వార్తల్లో నిలుస్తోంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక రైతు పొలంలో ఈ బల్లి కనిపించింది.

ముందు కాళ్ళ నుంచి వెనక కాళ్ళ వరకు విస్తరించి ఉన్న ఈ బల్లి రెక్కలు గాలిలో ఎగరడానికి సహకరిస్తాయి.ఈ బల్లి కి రెక్కల తో పాటు ఒక తోక కూడా ఉంటుంది.

సాధారణ బల్లికి రెక్కలు వస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉండే ఈ బల్లులు గాల్లో ఎగురుతూ ఉంటాయి.అయితే ఇవి చాలా అరుదైన జాతికి చెందిన బల్లులు కాగా.

వీటిని డ్రాకో వోలోన్స్ అని పిలుస్తుంటారు.

Telugu Draco Volans, Lizard, Lokesh Poojari, Uttarakhand, Vireal Latest-Latest N

ఎగరడం మాత్రమే కాదు ఊసరవెల్లి లాగా రంగులు కూడా మార్చగల ఈ బల్లులు ఏ ఆకుపై వాలితో ఆ ఆకు రంగులోకి క్షణాల్లో మారిపోతాయి.దీనితో వీటిని గుర్తించడటం కష్టం అని అంటుంటారు.అయితే దాదాపు 100 మీటర్ల దూరం గాల్లో ఎగరగల ఈ బల్లులు పక్షి వలే వేగంగా ప్రయాణించగలవు.

ఈ జాతి బల్లులు పశ్చిమ కనుమలు, దక్షిణాసియా ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే తాజాగా దొరికిన ఈ ఎగిరే బల్లి ని లోకేష్‌ పూజారీ . సంతగల్‌ అటవీ అధికారులకు అప్పగించారు.ఎగిరే పాములు కూడా ఎన్నోసార్లు కెమెరా లకు కనిపించి కనువిందు చేశాయి.

చాపలు, కప్పలు, కుందెలు వంటి పలు జీవారసులకు కూడా గాల్లో ఎగిరే శక్తి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube