వైరల్: ఎప్పుడైనా చాక్లెట్ బిర్యానీ తిన్నారా..?! ఎలా ఉంటుందంటే..?!

చాలా మందికి వంట చేయడం అంటే చాలా ఇష్టం.ఆడవాళ్లకు అయితే వంట చేయడం చాలా సులువు అనే చెప్పాలి.

 Viral Have You Ever Eaten Chocolate Biryani How Can That Be-TeluguStop.com

ఎందుకంటే ఆడవాళ్లు ఎక్కువ శాతం వంట గదిలోనే ఉంటారు కాబట్టి.వంట గదిలో ఎప్పుడు ఎదో ఒక కొత్త రకం వంటకం చేస్తూనే ఉంటారు.

అప్పట్లో అయితే కేవలం ఆడవాళ్లు మాత్రమే వంటలు చేసేవారు.మగవాళ్ళు అస్సలు వంట గదిలోకి కూడా అడుగు పెట్టేవారు కాదు.

 Viral Have You Ever Eaten Chocolate Biryani How Can That Be-వైరల్: ఎప్పుడైనా చాక్లెట్ బిర్యానీ తిన్నారా.. ఎలా ఉంటుందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కాలం మారింది కాలంతో పాటు మనుషులు కూడా మారిపోయారు.ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు వంటలు చేయడం మనం చూస్తూనే ఉన్నాము.

టీవీ ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా వంటలు చేసేది మగవారే.రకరకాల వెరైటీ డిష్ లను మనకు పరిచయం చేస్తూ ఉంటారు.

అవి చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం నోట్లో నీళ్లు ఊరిపోతాయి.దానికి తగ్గట్టు ఆ వంటకాన్ని రుచి చూసి మన యాంకర్స్ ఇచ్చే ఎక్సప్రెషన్స్ చూస్తుంటే నిజంగానే ఆ రెసిపీ సూపర్ గా ఉందేమో అని అనుకుంటాం కదా.

నిజానికి అసలు ఆ వంటకం ఎలా ఉన్నాగాని యాంకర్స్ మాత్రం సూపర్, వారెవ్వా, చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది ఇలాంటి రెసిపీని ఎక్కడా చూడలేదని ముఖంలో హావభావాలు కనబరుస్తూ చెప్పే డైలాగ్స్ వింటే ఎవరయినా సరే నిజమే అనుకుంటున్నారు.ఆ రెసిపీ బాగున్నా, బాగోలేకపోయిన బాగుంది అనే చెప్పాలి కదా.ఎక్కడా లేని విధంగా వెరైటీ కాంబినేషన్లో రెసిపీలు చేసి చూపిస్తున్నారు.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక ఫుడ్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

దానిని పాకిస్థాన్‌ దేశంలోని కరాచీ అనే ప్రాంతంలో ఉన్న ఆర్‌సీబీ అనే ఫుడ్ ఛానల్ వాళ్ళు పోస్ట్ చేసారు.అయితే ఈ వీడియోలో వాళ్ళు తయారుచేసిన రెసిపీని చూసి అందరూ కూడా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

అసలు ఇంతకీ ఆ ఫుడ్ కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారు.దాని పేరు “చాక్లెట్ బిర్యానీ“.

బిర్యానీ వేరుగా చాక్లెట్ వేరుగా ఉండవండోయ్.రెండు కూడా కలిసే ఉంటాయి అన్నమాట.

Telugu Choclate Biryani, Social Media, Viral Latest, Viral News-Latest News - Telugu

అంటే సదరు ఫుడ్ ఛానెల్ వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ఐటమ్ ఏంటంటే.చాక్లెట్ తో బిర్యానీ అన్నమాట.ఏంటి చాక్లెట్ తో బిర్యానీ కూడా చేస్తారా అని షాక్ అవుతున్నారా.కానీ చేసేసారు అండి.అంతేకాకుండా ఈ చాక్లెట్ బిర్యానీని ఒక యూట్యూబర్ కొనుక్కుని మరి టేస్ట్ చేసి ఆ రెసిపీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు.“ఈ రెసిపీని కనుక మీరు తిననట్లయితే అసలు ఇప్పటివరకు రుచికరమైనదేదీ తిననట్లే అని భావించండి.అంత బాగుంది ఈ బిర్యానీ.అసలు దీనిని ఇంత టేస్ట్ గా చేసిన చెఫ్ ఎవరో నాకు తెలియదు కానీ.అతడి చేతులను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది ” అని ఈ రెసిపీ గురించి చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొంతమంది అయితే చాక్లెట్ బిర్యానీ కూడా చేస్తారా చాదస్తం కాకపోతే అని ఎవరి స్టైల్ లో వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

#Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు