దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువగా కొనసాగుతుంది.దీనితో అలెర్ట్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మెరుగు పరిచేలాగా సన్నాహాలు చేపడుతున్నారు.
అలాగే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో ముందడుగు వేస్తోంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో గూగుల్ సంస్థ వ్యాక్సినేషన్ కు ఎంకరేజ్ చేసేలా… ఒక వీడియోను సిద్దం చేసింది.
ఆ వీడియోకు ‘గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్’ (మీరు ప్రేమించిన దానికి మరలండి) అంటూ నామకరణం చేసింది.
ప్రస్తుతం గూగుల్ సంస్థ అవగాహన కార్యక్రమం అమెరికాలో మొదలుపెట్టింది.
అమెరికాలో వాక్సినేషన్ ప్రక్రియను దాదాపు అత్యధిక జనాభా కు అందచేసేలాగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఇదిలా ఉండగా మరోవైపు చాలా మంది ప్రజలలో వాక్సినేషన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోన్న సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి.
అలాగే ఆలా అన్ని సందేహాలు, అపోహలు కూడా తప్పుడు సమాచారం నుంచి వచ్చినవి అన్న ఆరోపణలు కూడా తలెత్తాయి అని అందరికి తెలుసు.
ఇక వాటి పై క్లారిటీగా తాజాగా గూగుల్ కొత్త వీడియోను సిద్ధం చేసింది.ఈ వీడియో ఒక నిమిషం పాటు ఉండడం, అలాగే అందులో ప్యాండమిక్ ఇయర్(మహమ్మారితో గడిపిన సంవత్సరం) గురించి గుర్తు చేసే విధంగా ఉంది. ఇళ్లకే పరిమితం కావాలని నిర్భందించిన వీడియో.
మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి తిరిగి రావాలనే విధంగా వీడియోను రూపొందించింది గూగుల్.ఇక మరోవైపు గూగుల్ సెర్చ్ బార్ లో సోషల్ డిస్టెన్స్, స్కూల్ క్లోజింగ్, నిబంధనల ఊబిలో ఎక్కువగా కూలిపోయారనీ, వీటన్నిటి నుంచి ప్రజలు బయటపడాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ వేయించుకోవాలి తెలియజేస్తుంది.
ప్రస్తుతం గూగుల్ తయారు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.