వైరల్: పాకిస్థాన్ లో నడిరోడ్డుపై డాన్స్ చేసిన అమ్మాయి.. అక్కడ వారికి స్వేశ్చ దొరికినట్టేనా!

సోషల్ మీడియాలో పరిధి రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలూ, విశేషాలు ఇట్టే తెలిసిపోతున్నాయి.ఈ క్రమంలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 Viral  Girl Dancing On The Sidewalk In Pakistan  , Women, Dance, Viral Latest,-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మాయి పోల్‌ డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా లింగ పక్షపాత చర్చకు ఈ వీడియో దారితీసింది.

చివ‌రికి, ఇస్లామాబాద్ పోలీసులు రంగంలోకి దిగి, ఆ యువ‌తికి మ‌తి స్థిమితం లేని కారణంగా అలా డాన్స్ చేసిందని వివరణ ఇచ్చుకున్నారు.అయితే ఈ మాటల్లో నిజమెంత మనకు తెలియదు కానీ, సదరు వీడియో పైన ఒక్కొక్కరు ఒక్కోలాగా కామెంట్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి ఒంటరిగా బహిరంగ ప్రదేశంలో రోడ్డు మ‌ధ్య‌లో ఉన్న డివైడ‌ర్‌పై వున్న ఒక పోల్ ని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ వుంది.ఇది దూరం నుండి గమనిస్తున్న ఓ వ్య‌క్తి కెమెరాను జూమ్ చేసి మరీ వీడియో చిత్రీకరించాడు.

ఆ త‌ర్వాత అలా డాన్స్ చేసినందుకు ఆమెను తప్పుబడుతూ.ఆ వీడియోని ఇస్లామాబాద్ పోలీసు అధికారి ఖాతాకు ట్యాగ్ చేస్తాడు.

అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఆ అమ్మాయిపై అవసరమైన చర్య తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను డిమాండ్‌ చేశాడు.

కాగా, అతడు తీసిన వీడియోతో పాటు, అతని కంప్లైట్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే దీనిపైన నెటిజన్లు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు.అమ్మాయికి తెలియకుండా డ్యాన్స్‌ని సీక్రెట్‌గా వీడియో తీసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కొంతమంది నెటిజన్లు సీరియస్ అవుతుంటే, అమ్మాయిలు స్వేచ్ఛగా డ్యాన్స్‌ చేసుకునే స్వతంత్రం కూడా లేదా అంటూ కొంతమంది లేడీ నెటిజన్లు నిలదీస్తున్నారు.

అలాగే వీడియో తీసే వారు మాట్లాడిన మాట‌లపై కొంద‌రు నెటిజ‌న్లు తీవ్రస్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube