దోమలను చంపి దాచుకుంటున్న యువతి.. కారణమేమిటంటే..?

దోమల బెడద ఎక్కువగా ఉండే దేశాల్లో మన దేశం కూడా ఒకటనే సంగతి తెలిసిందే.దోమల వల్ల వచ్చే వ్యాధులు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవడానికి కారణమవుతాయి.

 Girl Collects Every Mosquito After Killing, Mosquito, Viral, Mosquito Corpses, V-TeluguStop.com

వేసవికాలంతో పోలిస్తే వర్షాకాలం, చలికాలం దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే దోమల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది.

ఒక అంచనా ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది దోమకాటు వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు.

దోమలు కుట్టకుండా దోమ తెరలు, జెట్ కాయిల్స్, ఎలక్ట్రిక్ బ్యాట్ లను ఎక్కువమంది ఉపయోగిస్తారు.

అయితే ఒక యువతి మాత్రం 14వ ఏట డెంగ్యూ బారిన పడటంతో అప్పటినుంచి దోమలను దాచుకుంటూ వస్తోంది.ప్రస్తుతం ఆ యువతి వయస్సు 19 సంవత్సరాలు కాగా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి సదరు యువతి దోమలను చంపి నోట్ బుక్ లో అతికించి దాచుకుంటూ ఉండటం గమనార్హం.

Telugu Evert Mosquito, Mosquito, Mosquitoes-Latest News - Telugu

ఈ యువతి పేరు శ్రేయా మహోపాత్ర కాగా డెంగ్యూ బారిన పడిన తరువాత శ్రేయా దోమలను చంపడమే పనిగా పెట్టుకుంది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఈమె రెండు సంవత్సరాల నుంచి దోమలను చేతులతో చంపడం లేదా మస్కిటో బ్యాట్ తో చంపడం అలవాటుగా చేసుకుంది.దోమలు కుట్టడం ద్వారా పనిపై ఏకాగ్రత కుదిరేది కాదని.అందుకే దోమలను చంపుతున్నానని శ్రేయా చెబుతున్నారు.
తనను కుట్టకముందే దోమలను చంపేయాలని అనుకున్నానని.నోట్ బుక్ పై నంబర్లు వేసి అతికించడం ద్వారా ఎన్ని దోమలను చంపానో గుర్తు ఉంటుందని ఆమె అన్నారు.

దోమలను చంపి వార్తల్లో నిలిచిన ఈ యువతి దోమలను చంపి అతికించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.శ్రేయా చేసిన ఈ పని వల్ల ఆమె సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube