వైరల్: బార్బీ డాల్ లా మారడానికి ఈ యువతి ఏకంగా..?!

ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అందంగా కనిపించడానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టడానికి అయినా వెనుకాడరు.

 Viral Germany Woman Spends 24 Lakh Rupees To Look Like Barbie Doll, Boby Dall, S-TeluguStop.com

మన దేశంలో ఉండే మహిళలు మాత్రమే కాకుండా విదేశాలలో ఉండే మహిళలు కూడా డబ్బులు బాగానే ఖర్చు పెడతారు.అందంగా కనిపించడానికి డబ్బులను నీళ్లలాగా ఖర్చు చేస్తుంటారు.

ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన జెస్సీ బన్సీ అనే మహిళే ఉదాహరణ అని చెప్పవచ్చు.కొంతమంది పుట్టుకతోనే అందంగా పుడతారు.

మరికొంతమంది మాత్రం అందంగా కనిపించాడానికి రకరకాల సర్జరీలు చేయించుకుని డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు.ఈ అందం పిచ్చితో జర్మనీకి చెందిన జెస్సీ బన్సీ చేసిన పని గురించి తెలిస్తే మీరే షాక్ అవుతారు.

జెస్సికి చిన్నప్పటి నుంచి బార్బీ బొమ్మలు అంటే చాలా ఇష్టం.

అలా చిన్న పిల్లలు ఆడుకునే బార్బీ బొమ్మలాగా తాను మారాలనుకుంది.

ఇంకేముంది అనుకున్నదే తడువుగా బార్బిలాగా తయారవ్వాలనే పిచ్చి కోరికతో తన దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఖాళీ చేసేసుకుంది.జెస్సి తన చిన్నతనం నుంచి ఎక్కువ సమయాన్ని బార్బీ బొమ్మలతో గడుపుతూ వాటికి మేకప్‌ చేస్తూ, అందమైన బట్టలు వేస్తూ అందంగా తయారుచేసేదట.

అలా అలా జెస్సి మనసులో కూడా తాను కూడా అలా బార్బీ డాల్ మాదిరిగానే మారిపోవాలని అనుకుందట.

Telugu Boby Dall, Breast Surgery, Germany, Barbie Doll, Spends Rupees, Vienna, L

ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వద్దు ఆనడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మరి వియన్నా వెళ్ళిపోయి అక్కడ బార్బీ డాల్ మాదిరిగా బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకుంది.అ సర్జరీ కోసం తాను సంపాదించిన డబ్బులు అన్ని ఖర్చు పెట్టేసిందట.అక్కడితో ఆగకుండా పెదవులకు కూడా సర్జరీలు చేయించుకున్నది.

ఆ తరువాత మళ్ళీ 2020 లో రెండోసారి కూడా బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకుంది.ఇలా బ్రెస్ట్‌ ఇంప్లాంట్స్‌, లిప్‌ ఫిల్లర్స్‌, బొటాక్స్‌, లైపోసక్షన్ లాంటి సర్జరీల కోసం ఆమె ఏకంగా రూ.24 లక్షలు ఖర్చు పెట్టేసిందట.ఇంకా జెస్సి గురించి తెలుసుకోవాలనుంటే తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ చూస్తే అర్ధం అవుతుంది.

ప్రస్తుతం జెస్సి బింబో కమ్యూనిటీలో ఒక సభ్యురాలుగా ఉండడం పట్ల ఎంతో గర్వంగా ఉన్నదని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube