వైరల్: బావి కోసం తవ్వుతుంటే కోట్లు విలువ చేసే రత్నాలు..!?

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.రాత్రికి రాత్రే కోటీశ్వరులు, లక్షాధికారులు అయిన వారిని మనం చాలా మందినే చూసి ఉంటాము.

 Viral Gems Worth Quotes While Digging For A Well, Viral Latest, News Viral, Soci-TeluguStop.com

అయితే అదృష్టం అనేది ఇప్పుడు వ్యక్తిని మరింత కోటీశ్వరుడిని చేసింది.కొడితే కొండను ఢీ కొట్టాలి అనే సామెత మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది కదా.అలాగే ఈ రత్నాల వ్యాపారి కూడా ఒక్కసారిగా అపర కుబేరుడు అయిపోయాడు.అసలు ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయానికి వస్తే.

శ్రీలంక దేశంలోని రత్నపుర ప్రాంతాల్లో ఒక రత్నాల వ్యాపారి నివాసం ఉంటున్నాడు.అయితే అతను నివసించే ప్రాంతంలో అధికంగా మణులు, రత్నాలు దొరుకుతాయట.

ఈ క్రమంలో ఆ రత్నాల వ్యాపారి నీటి కోసం అని పెరట్లో బావి తవ్వుస్తున్న క్రమంలో ఒక పెద్దరాయి బయట పడింది.దీనిని ‘నీలమణి‘ అని పేరుతో పిలుస్తారట.

నీళ్లకోసం బావి తవ్వుతున్న క్రమంలో ఆ మనుషులకు భూమి లోపల కొన్ని అరుదైన రాళ్లు తగులుతున్నట్లు అనిపిస్తోందని, ఆ తవ్వకాల్లో ఈ నీలమణి బయటపడిందని రత్నాల వ్యాపారి చెప్పాడు.ఆ రాయి బయట పడిన వెంటనే ఆ రత్నాల వ్యాపారి అధికారులకు తెలియచేయగా, అక్కడికి వచ్చిన జెమ్మాలజిస్ట్ లు ఆ రాయిని శుభ్రం చేసి దాని విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.745 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

అయితే ఈ రత్నాల రాయి దాదాపు 40 కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడి ఉంటుందని ప్రఖ్యాత జెమ్మాలజిస్ట్ అన్నారు.

ఈ అతి పెద్ద రాయి లోపల చిన్న చిన్న ఇంద్ర నీలపు రాళ్లు పొదిగి ఉన్నాయని అందుకే దీనిని నీలమణుల క్లస్టర్ అంటారు అని అన్నారు.ఈ నీలపు రాయి బరువు పరిశీలిస్తే 510 కేజీలు దాక ఉంది.అంటే దాదాపు 2.5 మిలియన్ కేరట్లు ఉంటుందిని అంచనా వేస్తున్నారు.ఇంత పెద్ద నీలపు రాయిని ప్రైవేట్ వ్యక్తులు గాని లేదంటే మ్యూజియంలను నిర్వహించే వారు గాని కొనుకోవలిసిందే అని శ్రీలంక జాతీయ జెమ్, జువెలరీ అథారిటీ చైర్మన్ తిలక్ వీరసింగ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube