వైరల్ వీడియో...నా పెన్సిల్ తీసుకున్నాడు, కేసు పెట్టాలంటున్న చిన్నారి

చిన్న పిల్లలు అంటే గోల చేయడం చాలా సర్వసాధారణం.చిన్న పిల్లలు గోల చేయకపోతేనే తప్పు.

 Viral Video Took My Pencil The Kid Who Wants To Put The Complaint Details, Viral-TeluguStop.com

అయితే గోల చేయడం శృతి మించితే పరిస్థితులు ఎవరి అదుపులో ఉండరు.అందుకే చిన్న పిల్లలను చాలా వరకు తల్లిదండ్రులు ఫ్రీడం ఇవ్వడానికి ఇష్టపడరు.

అతి గారాభం వల్ల ఏమవుతుందో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి.అయితే చిన్న పిల్లలకు పోలీసులు అన్నా పోలీసు స్టేషన్ అన్నా చాలా భయం.అసలు దాని పేరు ఎత్తితేనే చాలా భయపడతారు.అది చిన్నప్పటి నుండి ఆ భయం ఉంటుంది.

కానీ ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నది ఒకప్పటి చిన్నారుల గురించి.కానీ ఇప్పటి చిన్నారులు పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితి ఉంది.

ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అంటేనే భయపడే చిన్నారులు ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారంటే ఇక మీరు అర్ధం చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న చిన్నారులకు ఏ మాత్రం భయం లేదన్నది మనం అర్ధం చేసుకోవచ్చు.ఇక అసలు విషయం లోకి వెళ్తే తాజాగా ఓ చిన్నారి తన స్నేహితుడు తన పెన్సిల్ దొంగతనం చేశాడని ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నా పెన్సిల్ దొంగతనం చేశాడు కేసు పెట్టాలని పోలీసులను కోరాడు.

అయితే ఇద్దరు చిన్నారులు మాత్రం ఏ మాత్రం భయపడకుండా తన స్నేహితునిపై కేసు పెట్టాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.అయితే చిన్నారులు అమాయకత్వానికి పోలీసులు ముచ్చట పడి సముదాయించే ప్రయత్నం చేశారు.ఈ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఈ చిన్నారులు మాట్లాడుతుంది చూసి నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ తో ఈ వీడియో నెట్టింట్లో మరింత వైరల్ గా మారుతోంది.

మీకూ ఈ వీడియో చూడాలని ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం.ఈ వీడియో చూసేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube