వైరల్: వధూవరులకు పెళ్లి గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు.. తెరిచి చూస్తే షాక్..!

Viral Friends Gave Gift To New Couples Shocked Seeing Inside

పెళ్లి అంటేనే బంధువులతో, స్నేహితులతో సందడిగా ఉంటుంది.జీవితం లో ఎవరికైనా పెళ్లి ఒక మర్చిపోలేని వేడుక.

 Viral Friends Gave Gift To New Couples Shocked Seeing Inside-TeluguStop.com

అందుకు తగట్టుగానే బంధువులు, స్నేహితులు పెళ్లికి గుర్తుగా ఎన్నో బహుమతులు ఇస్తూ ఉంటారు.పెళ్లి అయ్యాక వధూవరులిద్దరూ దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండాలని ఫ్రిడ్జ్, బీరువా, వాషింగ్ మెషీన్, మంచం, వంటకి సంబంధించినవి ఇలా రకరకాల వస్తువులను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు.

అలాగే నగదు రూపంలో కూడా కొంతవరకు గిఫ్ట్ లు ఇస్తుంటారు.

 Viral Friends Gave Gift To New Couples Shocked Seeing Inside-వైరల్: వధూవరులకు పెళ్లి గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు.. తెరిచి చూస్తే షాక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఓ పెళ్లిలో వధూవరులకు తమ స్నేహితులు గిఫ్ట్ ఇచ్చే విషయంలో కొత్తగా ఆలోచించారు.అందరూ ఇచ్చే పద్దతిలో కాకుండా వెరైటీగా ఇవ్వాలనుకున్నారు.ఒక ఐదారుగురు స్నేహితులు కలిసి సందడి చేస్తూ వధూవరుల కోసం ఒక గిఫ్టును తీసుకొచ్చారు.వాషింగ్ మెషీన్ ఉండే ఓ సీల్డ్ బాక్స్ కు పూలతో అలంకరించారు.వాషింగ్ మెషీన్ గిఫ్ట్ గా ఇస్తున్నట్టు అందరిని నమ్మించే ప్రయత్నంలో ఎంతో బరువు ఉన్నట్టు.జరగండి.జరగండి… అంటూ వేదిక పైకి తెచ్చారు.వధూవరులకుగిఫ్ట్ ను ప్రెజెంట్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఫోటోలు తీసుకున్న తర్వాత వధూవరులిద్దరూ తమ స్నేహితులు సందడి చేసుకుంటూ తెచ్చిన ఆ బరువైన సర్ ప్రైజింగ్ గిఫ్టును ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యారు.చూస్తే ఆ గిఫ్టులో ఏమి లేదు.ఖాళీ బాక్స్ ఉండడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

వాషింగ్ మెషిన్ ను గిఫ్ట్ గా ఇస్తున్నట్టు, అది కూడా ఎంతో బరువుగా ఉన్నట్టు బాగా నటించారు అంటూ అక్కడున్న బంధువులు, స్నేహితులు జోకులేసుకుని సందడి చేశారు.దీనికి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడు వైరల్ గా మారింది.

#Machine #Marraige Gift #Friends #Gift #Friends

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube