వైరల్ : ఆ ప్రాంతంలో అమ్మవారికి నైవేద్యంగా పాదరక్షలు..!

మన భారతీయ సాంప్రదాయ ప్రకారంఏదైనా ఆలయానికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయ, పువ్వులు, పండ్లు, ఫలం లాంటివి నైవేద్యంగా తీసుకొని వెళ్ళడం, అలాగే ఆలయంలోకి వెళ్ళే సమయంలో పరిశుభ్రతగా, నిష్ఠ నియమాలతో వెళ్తూ ఉంటాం.అలాగే గుడి బయటనే చెప్పులు  విడిచి మరి వెళుతూ ఉంటాం.

 Viral: Footwear As An Offering To Ammavaru God Devotees, Offering, Footwear, Lak-TeluguStop.com

ఐతే ఆ ప్రాంతానికి చెందిన అమ్మవారికి మాత్రం పాదరక్షకులు నైవేద్యంగా ఇస్తారట అయ్యో ఇదేంటి అపచారం అని అనుకుంటున్నారా.?! కానీ ఇది నిజం అక్కడి వారు అమ్మవారికి చెల్లించుకున్న మొక్కు అదేనట.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని కాలాబురాగి జిల్లాలో ఉన్న లక్కమ్మ దేవి ఆలయంలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు.ప్రతి  సంవత్సరం దీపావళి పండుగ అనంతరం 6వ రోజు జరిగే ఈ జాతరకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి చెప్పుల దండను  నైవేద్యంగా సమర్పించుకోవడం వారి ఆనవాయితీగా వస్తుంది.

కాలాబురాగి జిల్లా కేంద్రంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోలాబి గ్రామంలో లక్కమ్మ దేవి అమ్మవారి ఆలయం ఉంది.కులమతాలకు అతీతంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం తరలివస్తారు.

అమ్మవారిని కోరిన కోరికలు తీరిన వారందరూ ఇలా అమ్మవారికి చెప్పులు సమర్పించడం వారి ఆనవాయితీ.వాస్తవానికి ఆ చెప్పులను అమ్మవారు తల్లి ధరించి రాత్రి సమయంలో తిరుగుతుందని అక్కడి భక్తుల విశ్వాసంఅంతే కాకుండా కొత్తగా కోరికలు కోరుకుంటున్న వాళ్ళు ఆ చెప్పు దండలను వారి తలలకు తాకించుకుంటరట.

ఇలా కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా బాగా  ప్రసిద్ధి చెందడంతో లక్కమ్మ దర్శనానికి ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube