Bike fin e: వైరల్: బైక్‌పై ఏకంగా ఐదుగురు పోకిరీలు... పోలీసులు ఊరుకుంటారా?

దేశమంతటా ట్రాఫిక్ నియాలు యెంత కఠినతరం చేస్తున్నారో అందరికీ తెల్సిందే.అయినా పోకిరీలు మాత్రం చెలరేగిపోతున్నారు.

 Viral: Five Hooligans On A Bike Together. Will The Police Be Quiet  Bike,police'-TeluguStop.com

నడి రోడ్డుపై వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి తోటి వాహనదారులకు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఓ ఐదురుగు వ్యక్తులు ఒకే బైకుపై ప్రయాణించి.కేకలు వేసుకుంటూ రోడ్డుపై వెళ్తున్నారు.

వాళ్ళని చూసిన తోటి వాహనదారులు భయాందోళనకు గురి అయ్యారు.వారిలో ఒకరు వారికి సంబంధించిన వీడియోని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

ఇంకేముంది కట్ చేస్తే ఆ వ్యవహారం కాస్త పోలీసుల కంటపడింది.సామాన్య జనాలు ఊరుకున్నా, పోలీసులు అయితే ఊరుకోరు కదా.ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారని వారిపై చర్యలు తీసుకున్నారు.నిందితులపై మోటర్ వాహనాల చట్టం ప్రకారం కేసు బుక్ చేసారు.అంతేకాకుండా వారికి రూ.6,500 ఛలాన్ కూడా వేశారు.అక్కడితే వారిని వదిలెయ్యలేదు.ప్రజలకు అశాంతి కలిగించారంటూ.

అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత జైలుకు కూడా పంపారు.

ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోని చేసిన తరువాత మొత్తం వారిగురించి వాకబు చేసాం.ఆ వాహనం నంబర్ ప్లేట్ కూడా స్పష్టంగా కనబడటంతో వారు ఈజీగా దొరికారు.

దాని ఆధారంగానే వారిని గుర్తించి చర్యలు తీసుకున్నాం.బైక్‌ని స్వాధీనం చేసుకొని.

ఐదుగురినీ అరెస్టు చేశాం.ఇలా ఎవరన్నా రోడ్డుపై అడ్డదిడ్డంగా ప్రయాణించి, రోల్స్ ని అతిక్రమించి, తోటి వాహనదారులకు అశాంతి కలిగిస్తే వారికి పట్టిన గతే మీకు పడుతుంది!అని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube