వైరల్: వేటగాళ్ల వలలో అలనాటి చేప..!

సాధారణంగా మనం చాలా రకాల చేపలను చూసే ఉంటాం.ఆ చేపలు ఏ జాతికి చెందినవి, వాటి గురించి పూర్తి వివరాలను మత్సకారులు చెపుతుంటారు.

 Viral Fishermen Caught Dinosaur Period Coelacanth Fish Near Madagascar-TeluguStop.com

మత్సకారులను ఓ చేప ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్ తీరంలో షార్క్ చేపలను పట్టే వేటగాళ్లు డైనోసార్ శకంనాటి అంతరించిపోయిన చేపను సజీవంగా పట్టుకున్నారు.

ఈ చేప జాతి సుమారు 42 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది.ఈ చేపను కోలకాంత్ అంటారు.

 Viral Fishermen Caught Dinosaur Period Coelacanth Fish Near Madagascar-వైరల్: వేటగాళ్ల వలలో అలనాటి చేప..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సొర చేపలను పట్టుకోవడానికి వేసిన ప్రత్యేక వలలో ఇది చిక్కింది.ఈ వేటగాళ్ళు లోతైన సముద్రంలో భారీ వలలు వేసి షార్క్ చేపలను వేటాడుతారు.

సముద్రం లోపల 328 అడుగుల నుంచి 492 అడుగుల వరకు వలలు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు.కోలకాంత్ చేప 1938 సంవత్సరానికి పూర్వం అంతరించిపోయినట్లు పరిగణించబడింది.

ఈ చేపను సజీవంగా పట్టుకున్నప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతారు.అయితే త్వరలో ఈ జాతి అంతమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కోయిలకాంత్ ఎనిమిది రెక్కలు, పెద్ద కళ్ళు, చిన్న నోరు, శరీరంపై ప్రత్యేక చారలు కలిగి వింతగా ఉంది.

దక్షిణాఫ్రికా జర్నల్ ఆఫ్ సైన్స్ లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం సొరచేపల వేట కోయిలకాంత్ చేపల ఉనికికి ముప్పు తెచ్చిపెట్టింది.

షార్క్ చేపల వేట 1980 ల నుంచి తీవ్రమైంది.మడగాస్కర్ వివిధ కోయిలకాంత్ జాతుల కేంద్రంగా మారిందని పరిశోధనలు చెబుతున్నాయి.అయితే వీటి వేటను ఆపడానికి అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇది వాటి ఉనికికి ప్రమాదంగా పరిణమించవచ్చు.

మన భూమిపై ఉన్న రకరకాల జీవరాశిపై మన శాస్త్రవేత్తలకు ఫుల్ క్లారిటీ ఉంది.సముద్రాల్లో, మంచు ఖండాల్లో ఉన్న వాటిపై మాత్రం అంతగా క్లారిటీ లేదు.

రోజూ కొత్త జీవుల కోసం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.కొత్త కొత్తవి కనిపిస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు కూడా ఈ చేపను చూసిన వారు వివిధ రకాల పరిశోధనలు చేస్తున్నారు.డైనోసర్ కాలం నాటి ఈ చేపను చూసి ఆశ్చర్యపోతున్నారు.

#Viral Fishermen #SouthAfrica #8 Swings #Scientists #Coelacanth Fish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు