వైరల్: చిన్నారి మెస్సేజ్ కు ఫిదా.. ప్రశంసల వెల్లువ...!

ప్రస్తుతం ఇప్పుడు అందరు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వాళ్ళ టాలెంట్ ను బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

కొన్ని వీడియోలు అయితే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది జీవితాలు మారిపోయాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.ఈ వీడియో చూడడానికి చిన్నదిగా ఉన్నాగాని ఒక సందేశం కూడా ఉండడం వలన నటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.

అంతేకాకుండా ఈ వీడియోలో కనిపించేది ఒక చిన్న పాప అవ్వడం వలన ఈ వీడియో నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంది.అసలు ఇంతకీ ఈ వీడియో ద్వారా ఆ బుడ్డది ఏమి సందేశం ఇచ్చిందో తెలుసుకుందామా.

Advertisement

ఈ వీడియోలో ఒక చిన్నారి తన భూజానికి ఒక రెడ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని బయటకి వెళ్లే గేట్ దగ్గర నుంచుని ఉండగా ఆ బుడ్డదాన్ని హలో ఎక్కడికి వెళ్తున్నారు అంటూ ఒక వాయిస్ ప్రశ్నిస్తుంది.ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ పాప కనిపించడం లేదా జాబ్ ‏కు వెళ్తున్నా అని ఆన్సర్ చెప్తుంది.

వెంటనే అమ్మాయిలు ఎక్కడన్నా జాబ్ చేస్తారా ఏంటి అని మరొక వాయిస్ వినిపిస్తుంది.దానికి సమాధానంగా మరి ఇంట్లో కూర్చుని వెల్లిపాయలు తీయమంటావా అంటూ వెటకారంగా ఆ బుడ్డది ఆన్సర్ ఇస్తుంది.

అక్కడితో ఆగకుండా చెస్తాం.మేము జాబ్ చెస్తాం.

మా కాళ్ల మీద మేము నిలబడతాం మీకు ఎమన్నా ప్రాబ్లమా ఏంటి అంటూ కౌంటర్ ఇస్తుంది.ఈ బుడ్డదాని మాటలకు, యాక్షన్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..

చిన్నపిల్లే అయిన సమాజానికి ఉపయోగపడే ఒక గొప్ప మెసేజ్ ను ఇచ్చింది అని అందరు ఈ పాపను పొగుడుతున్నారు.ఆడది అంటే ఇంట్లో కూర్చుని వంట చేసేది కాదు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి తన కాళ్ళ మీద తాను నిలవగలదు అని ఈ వీడియో సారాంశం అన్నమాట.

Advertisement

ప్రస్తుతం ఈ వీడియోలో కనిపించే చిన్నారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ వీడియోను రాఖీ పండుగ సందర్భంగా విజయవాడ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయింది.

తాజా వార్తలు