వైరల్: ఈరోజుల్లో కూడా ఇలా తల్లితండ్రులను సాకే వారు వున్నారా? అన్నీ తానై!

పిల్ల‌ల గురించి త్యాగాలు చేసే త‌ల్లితండ్రుల ఉదంతాలు మనచుట్టూ అనేకం వున్నాయి.మరి అలాంటి తల్లిదండ్రులకోసం త్యాగాలు చేసే సంతానం వుందా? అంటే ప్రశ్నార్ధకమే అవుతుంది.మారుతున్న ఈ కాలంలో నానాటికీ మానవ సంబంధాలు మసకబారిపోతున్నాయి.తల్లిదండ్రులు త‌మ జీవితంలో పొంద‌లేనివ‌న్నీ పిల్ల‌ల‌కు స‌మ‌కూర్చాల‌ని కలలు కంటూ కష్టపడుతూ వుంటారు.అందుకే త‌ల్లితండ్రుల‌ను సంతోషంగా ఉంచి వారు ప‌రిపూర్ణ జీవితం గ‌డిపేలా చూడ‌టం పిల్ల‌ల కనీస బాధ్య‌త‌.

 Viral: Even Today, Are There People Who Support Their Parents Like This All By-TeluguStop.com

ఇలా అలాంటి బాధ్యతాయుతమైన పిల్లలను చూసినపుడు మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది.

తాజాగా అలాంటి ఓ ఘటన ముంబైలోని మిరా రోడ్డులో కనబడింది.దృష్టిలోపంతో బాధ‌ప‌డే త‌ల్లితండ్రుల‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటున్న ఓ చిన్నారి బాలిక వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడం మనం గమనించవచ్చు.

మిత్ ఇంద‌ల్క‌ర్ అనే అతను ఈ వీడియోను షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 37 ల‌క్ష‌ల మందికి పైగా దీనిని వీక్షించారు.వీడియోని గమనిస్తే… స్కూల్ యూనిఫాం ధ‌రించిన బాలిక దృష్టి లోపంతో బాధ‌ప‌డుతున్న త‌ల్లితండ్రులతో కూర్చుని వారికి స‌ప‌ర్య‌లు చేస్తుండ‌టం చూడవచ్చు.

అక్కడ రోడ్డు ప‌క్క‌న ఫుడ్ స్టాల్‌లో కూర్చున్న వారు స్నాక్స్ తీసుకున్న తరువాత బాలిక‌ తన త‌ల్లితండ్రుల‌కు క్లీనింగ్ చేయడంలో స‌హ‌క‌రించ‌డంతో పాటు వారిని స్టాల్ బ‌య‌ట‌కు తీసుకువెళుతుండ‌టం చాలా స్పష్టంగా చూడవచ్చు.కాగా వీరిని మొదటిసారి చూసిన‌ప్పుడు తాను ఉద్వేగానికి గుర‌య్యాన‌ని, వీరు రోజూ ఈ షాపుకు వ‌స్తుంటార‌ని, ఆమె త‌ల్లితండ్రులు అంధులే అయినా వారు త‌మ కూతురి క‌ళ్ల‌తో ప్ర‌పంచాన్ని చూస్తున్నార‌ని ఇంద‌ల్క‌ర్ ఈ వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube