వైరల్: కిచెన్ లోకి దూరిన ఏనుగు.. చివరకి..?!

జంతువులు అయినా మనిషి అయినా సరే ఆకలి ఎవరికైనా ఒక్కటే.మనిషి ఎంత కష్టపడినా అది కేవలం పొట్టకూటి కోసమే.

 Viral Elephant Snuck Into The Kitchen Finally-TeluguStop.com

మనం ఎన్ని పనులు చేస్తున్న సమయానికి ఆహారం తీసుకున్న తర్వాతనే ఏ పనైనా చేయడానికి ఓపిక ఉంటుంది.అలా ఆహారం తీసుకోకుండా ముందుకు సాగాలంటే మాత్రం నిజంగా కష్టసాధ్యమైన పనే.ఇక అసలు విషయంలోకి వెళితే.

తాజాగా ఆకలితో ఉన్న ఏనుగు ఇంట్లోనే గోడలను బద్దలు కొట్టి మరి కిచెన్ లోకి ప్రవేశించింది.

 Viral Elephant Snuck Into The Kitchen Finally-వైరల్: కిచెన్ లోకి దూరిన ఏనుగు.. చివరకి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సంఘటన థాయిలాండ్ దేశంలో సంభవించింది.అందరూ నిద్రిస్తున్న రాత్రి రెండు గంటల సమయంలో ఆ ఏనుగు ఓ ఇంటి వెనుక నుంచి కిచెన్ ఆనుకొని ఉన్న గోడలను బద్దలు కొట్టి తన తల దూరెంత రంధ్రాన్ని చేసింది.

ఇంటి యజమానులు బాగా నిద్రిస్తున్న సమయంలో ఏదో చప్పుడు అవుతున్న శబ్దం వినిపించడంతో ఇంట్లోనే సభ్యులందరూ భయబ్రాంతులకు లోనయ్యారు.

ఇంట్లో వారందరూ ధైర్యం చేసి అసలు ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి శబ్దం వస్తున్న వైపు వెళ్లి చూడగా ఆ సమయానికి ఓ ఏనుగు వారి ఇంటి వెనకాల నుంచి కిచెన్ లోకి తన తల దూరేలా గోడను పగలగొట్టుకుని తలను లోపలికి పెట్టి కిచెన్ లో ఉన్న రైస్ ప్యాకెట్ ను ఆరగించడం మొదలుపెట్టింది.రైస్ ప్యాకెట్ ను ఖాళీ చేసేంతవరకు కుటుంబ సభ్యులు వేచి చూసి ఆ తర్వాత గట్టిగా అరవడంతో ఆ ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది.ఈ విషయంపై ఇంటి యజమానులు మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతంలో ఏనుగులు అప్పుడప్పుడు సంచరిస్తుంటాయని, కాకపోతే ఎప్పుడు ఇలాంటి సంఘటన ఎవరికి అనుభవం కాలేదని ఈ ఏనుగు ఇలా ఎందుకు చేసిందో అర్థం అవ్వట్లేదు అంటూ వాపోయారు.

ఏదేమైనా ఏనుగు చేసిన పనికి ఆ ఇంటి యజమానులకు గోడ నిర్మితం కోసం బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

#Viral #Entered #Kichten #Elephant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు