వైరల్: కోటి రూపాయలతో అమ్మవారికి అలంకరణ..!

దేవుడిపై ఉన్న భక్తితో భక్తులు తమ శక్తి కొలది దేవుడికి అలంకారణతో పాటు నైవేద్యాలు కూడా సమర్పించుకుని తమ కోరికలను తీర్చమని దేవుళ్లకు ఎన్నో రకాలుగా మొక్కుకుంటారు.అలాగే కొంతమంది ఏ పని చేసిన తమ ఇష్ట దైవాన్ని మనసులో స్మరిస్తూ ఆ పని మొదలుపెడితే వారికి అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు.

 Viral Durga Mata Decorated With Crores Of Rupees In Nizamabad District, Viral La-TeluguStop.com

ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దైవాన్ని కొలుస్తూ ఉంటారు.ప్రస్తుతం ఇప్పుడు దసరా పండగ సందర్బంగా అమ్మవారు రోజుకు ఒక రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు.

ఈ క్రమంలో దేవి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అవతారంలో అలంకరిస్తారు.ఈ క్రమంలోనే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అమ్మవారిని ఏకంగా కోటి రూపాయలతో అలకరించారు.

ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే .నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండల కేంద్రంలోని పాతుర్‎ లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో కోటి రూపాయలతో అలంకరించారు.వీటిలో 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు ఉన్నాయి.ఇలా కోటి రూపాయలతో అలంకరించిన అమ్మవారి లక్ష్మి స్వరూపాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.కాగా అమ్మవారిని కోటి రూపాయలతో అలంకరించారు కాబట్టి అక్కడి నిర్వాహకులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లతో నిత్యం కాపలగా ఉన్నారు.ప్రస్తుతం అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరించిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్‎గా మారింది.

Telugu Rupee, Rupees, Durga Mata, Lakshmidevi, Navaratir, Nizamabad, Patur, Pooj

లక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.సరిగ్గా ఇలాగే పోయిన ఏడాది గద్వాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కూడా ఇలాగే అమ్మవారిని కోటి రూపాయలతో అలంకరించారు.మళ్ళీ ఈ సంవత్సరం ఇలా నిజామాబాద్ లో అమ్మవారిని డబ్బులతో అలంకరించారు.అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాము అని అక్కడి పూజారి వచ్చిన భక్తులకు ఆశీర్వచనాలు అందచేస్తున్నారు.

 లక్ష్మీదేవి అలంకరణ లో అమ్మవారి రూపం చూడడానికి రెండు కళ్లు చాలవు అనే విధంగా అమ్మవారు అక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube