వైరల్: నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవిని కాపాడిన మరో మూగజీవి..!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం.తాజాగా వావ్ అనిపించే విధంగా ఉండేలా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Viral Dog Saved The Deer Cub In The River-TeluguStop.com

ఈ వీడియో చూసిన తర్వాత అందులో ఉన్న కుక్కను మెచ్చుకోకుండా ఉండలేరు.దీనికి కారణం ఆ శునకం చేసిన పని.అంతే కాదండి ఆ శునకం కి సూపర్ హీరో అని బిరుదును కూడా ఇచ్చేశారు నెటిజన్స్.

సామాజిక జీవితంలో మన చుట్టూ, మనతో కలిసి ఎన్నో రకాల జీవాలు పెరుగుతూనే ఉంటాయి.

 Viral Dog Saved The Deer Cub In The River-వైరల్: నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవిని కాపాడిన మరో మూగజీవి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో కుక్కలు మొదటి స్థానంలో నిలుస్తాయి.నిజానికి శునకాలకు అపారమైన తెలివితేటలు.

దీనికి ఉదాహరణగా పెద్దవారు కుక్కకున్న విశ్వాసం మనుషులకి కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు.అందుకు తగ్గట్టుగానే ఈ ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అలాగే ఏదైనా జీవికి ప్రాణికి అపాయం కలిగిందంటే చాలు కుక్కలు వెంటనే స్పందించి వారిని రక్షించడానికి శతవిధాల ప్రయత్నించడం మనం ఎన్నో చూసాము ఇప్పటివరకు.

తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చవిచూసింది.

నీటిలో కొట్టుకుపోతున్న జంతువును ఓ కుక్క రక్షించి ఒడ్డుకు చేర్చింది.ఈ సంఘటన మొత్తం ఆ కుక్క యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ట్రెండ్ గా కొనసాగుతోంది.ఇందుకు సంబంధించి అసలు విషయంలోకి వెళితే.

రోల్ఆఫ్ అనే వ్యక్తి యొక్క పెంపుడు కుక్క హార్లే తన చుట్టుపక్కల లేకపోవడంతో ఒక్కసారికి ఆందోళన గురి అయ్యి ఆ తర్వాత దాన్ని వెతకడం మొదలుపెట్టాడు.అయితే అతడు ఉన్న ప్రదేశంలో పక్కన ఉన్న సరస్సులో చూడగా అందులో ఈదుతూ కనిపించింది.

అసలు తన కుక్క ఎందుకు అలా చేస్తుందని భావించి దాని దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ షాపింగ్ సీన్ అతనికి కనబడింది.

దీంతో అతను ఎటువంటి ఆలస్యం చేయకుండా తన సెల్ ఫోన్ తీసి అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని వీడియో రూపంలో చిత్రీకరించాడు.

ఆ సరస్సులో జింకపిల్ల కొట్టుకోవడాన్ని తన కుక్క గమనించడంతో వెంటనే అది కూడా నీటిలోకి దూకి కాపాడింది.అలా కాపాడిన కుక్క జింక పిల్లను ఒడ్డుకు తీసుకు వచ్చింది.

అలా ప్రాణంతో తిరిగివచ్చిన జింకపిల్ల కుక్కతో కొద్ది సేపు సరదాగా కలిసి ఆడుకున్నాయి.ఆ తర్వాత జింక పిల్ల అడవిలోకి వెళ్ళిపోయింది.

దీంతో ఆ కుక్కను నెటిజెన్స్ హీరో అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ చేయడం చేస్తున్నారు.

#Social Media #Super Hero Dog #Harley Dog #Saved The Deer #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు